షాకింగ్ ఘటన.. బిర్యానీ తిని బాలుడు మృతి?

praveen
బిర్యాని.. ఈ పేరు వింటే చాలు   ఎంతో మందికి నోరూరిపోతుంది.. కేవలం హైదరాబాద్లోనే కాదండోయి దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు బిర్యాని ని అమితంగా ఇష్టపడుతుంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సంతోషం వచ్చినా బాధ వచ్చిన బిర్యానీ తినడానికి ఒక రెగ్యులర్ అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు ఎంతోమంది. ఇక హైదరాబాద్ బిర్యానికి ఎంతో ఫేమస్. ఇక దేశ నలుమూలల నుంచి వచ్చి మరి హైదరాబాద్లో బిర్యాని  రుచి చూడాలని భావిస్తూ ఉంటారు ఎంతోమంది.


 ఇక ఇటీవల కాలం లో ప్రతి ఒక్కరి జీవితం లో బిర్యానీ అనేది సర్వసాధారణం గా మారిపోయింది అని చెప్పాలి. అయితే సాధారణంగా ఎవరైనా సరే బిర్యాని ని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ ఇక్కడ అలా ఇష్టంగా తినడమే ఒక బాలుడి ప్రాణం పోవడానికి కారణమైంది. ఏకంగా బిర్యానీ తిని 12 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఘటన హైదరాబాద్ నగరంలో సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ఖైరతాబాద్ ప్రాంతంలో ఈ విషాదకర ఘటన నెలకొంది. ఇటీవలే లకిడికపూల్ లోని ఒక హోటల్లో బిర్యాని తెప్పించుకున్నాడు 12 ఏళ్ల బాలుడు.


 ఇక అతని తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఆ బిర్యాని తిన్నారు. కానీ ఆ తర్వాత మాత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  ఈ క్రమం లోనే వెంటనే ఆసుపత్రికి పరుగులు పెట్టారు. అయితే పరిస్థితి విషమించి ఇక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం వైద్యులు చికిత్స నేపథ్యం లో బాలుడి తల్లి అతని సోదరి కూడా అస్వస్థత నుంచి కోలుకుంటున్నారు అన్నది తెలుస్తోంది. అయితే ఇటీవలే సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలుడు తండ్రి. వెంటనే సదరు రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాడు. కాగా ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: