గర్ల్ ఫ్రెండ్ తో దిగిన ఫోటో ఫేస్ బుక్ లో పెట్టాడు.. కానీ తెల్లారేసరికి?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్నో ఫోటోలని  తరచూ పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ వుంటారు చాలామంది. ఇక తమకు ప్రియమైన వారితో దిగిన ప్రత్యేకమైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి నేటి రోజుల్లో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం సోషల్ మీడియాలో తన ప్రేయసితో దిగిన ఫోటో పోస్ట్ చేయడమే ఓ యువకుడి ప్రాణం పోవడానికి కారణం అయింది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగలడానికి సోషల్ మీడియా వేదిక అయింది.


 ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.  గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఆ ఇద్దరు. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. అందులో ఒకదానినీ ప్రియుడు ముచ్చటగా సోషల్ మీడియా లో పెట్టాడు. అంతే ఇక తెల్లారేసరికి ఊహించని ట్విస్ట్. బీహార్లోని పాతరబిన్ టోలి గ్రామానికి చెందిన లహ్వార్ కుమార్ అదే గ్రామానికి చెందిన ఒక యువతితో గత కొన్నేళ్లుగా ప్రేమ లో ఉన్నాడు.. ఇంట్లో తెలియకుండా వారి ప్రేమ విషయాన్ని రహస్యంగానే ఉంచారు.  ఇక ఇటీవలే లహ్వార్ కుమార్ ముచ్చటపడి తన గర్ల్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు ఫేస్బుక్లో పోస్టు చేసాడు.


 దీంతో ఇంట్లో వారి ప్రేమ విషయం తెలిసిపోయింది. ఇంకేముంది వారి లవ్ స్టోరీ క్లైమాక్స్ కి చేరుకుంది. ఇటీవల ఏదో పని మీద బయటకు వెళ్లిన లహ్వార్ కుమార్  రాత్రయినా ఇంటికి చేరుకొలేదు. కుటుంబ సభ్యులకు కంగారు పడ్డారు. ఊరంతా వెతికిన జాడ దొరకలేదు. చివరికి చేసేదేమీలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆ తర్వాతే ఏకంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లకు లహ్వార్ కుమార్ మృతదేహం చిక్కింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రియురాలి కుటుంబం ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇక వాళ్ళు హత్య చేసి ఉంటారని నిర్ధారించి విచారణ చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: