ఫుల్లుగా మద్యం తాగొచ్చిన హెడ్మాస్టర్.. విద్యార్థుల ముందే ఏం చేశాడో తెలుసా?

praveen
సాధారణంగా ఒక స్కూల్ హెడ్మాస్టర్ గా ఉన్న వ్యక్తి స్కూల్ బాధ్యతలను భుజాన వేసుకోవాలి. ఒక వైపు విద్యార్థులు చక్కగా చదువుతున్నారా లేదా అన్న విషయాన్ని గమనించడమే కాదు.. ఆ స్కూల్లో ఉన్న టీచర్లు విద్యార్థులకు ఏ విధంగా పాఠాలు బోధిస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇక ఆ స్కూల్లో విద్యార్థులు అందరూ కూడా చదువులో ఎప్పుడూ ముందుండేలా  చూసుకుంటూ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ ఇటీవలి కాలంలో ఎంతో మంది టీచర్లు గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఏకంగా తప్పతాగి స్కూల్ కి వచ్చి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు కూడా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన హెడ్మాస్టర్ చివరికి ఫుల్లుగా మందు కొట్టి పాఠశాలకు వచ్చాడు. నిషా తలకు ఎక్కడంతో  విద్యార్థుల ముందే రచ్చ రచ్చ చేశాడు.  స్కూల్లో ఉన్నాను అన్న విషయాన్ని మర్చిపోయి బార్ లో ఉన్నట్లుగా పాటలు పాడుతూ నేల మీద దొర్లుతూ నానా యాగీ చేశాడు అని చెప్పాలి. ఉదయాన్నే స్కూల్ కి వచ్చిన  వాడు వచ్చినట్టే పడిపోయాడు.

 నేల మీద దొర్లుతూ నేను బాగా తాగాను కానీ ఏమీ దొంగలించ లేదు  అంటూ పాట పాడాడు. ఈ ఘటన జార్ఖండ్లో వెలుగు చూసింది. హెడ్మాస్టర్ తీరుతో విద్యార్థులందరూ బిత్తరపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తర్వాత విద్యార్థులు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో హెడ్మాస్టర్ చేసిన ఘనకార్యం బయటపడింది. ఝార్ఖండ్ ధూమ్కాల్ లో శిఖరి పాడు బ్లాక్ లోని దర్బార్ పూర్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ గా పని చేస్తున్నాడు ఆండ్రియాన్ మరాండీ. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఇటీవలే ఇంటి దగ్గరే మద్యం తాగి వచ్చాడు. ఉదయం 11 గంటల సమయంలో  స్కూల్ కి వచ్చి నేల మీద పడి పోయి దొర్లుతూ పాటలు పాడాడు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు దర్యాప్తు చేపట్టాము అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: