వాటర్ బాటిల్ విషయంలో గొడవ.. ట్రైన్ నుండి కిందకు తోసేశారు.. చివరికి?

praveen
ఏంటో ఇటీవలి కాలంలో జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటే మనుషుల్లో పూర్తిగా మానవత్వం కనుమరుగైపోయింది ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే సాటి మనుషుల విషయంలో జాలి దయ అనే విషయాన్ని మరిచి పోయి చివరికి మారిపోయి దారుణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలకే దాడులకు పాల్పడటం కొన్నిసార్లు  కొంతమంది వ్యక్తుల ప్రాణాలను కూడా తీసి వేయడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి.

 ఉత్తరప్రదేశ్లోని లలిత్ పూర్ జిల్లా ఝాన్సీ ప్రాంతంలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని  తెలుస్తోంది. ఏకంగా ప్లాస్టిక్ బాటిల్ విషయంలో తలెత్తిన గొడవ ఒకరిపై ఒకరు దారుణంగా దాడి చేసుకునేంత వరకు వెళ్ళింది. వివరాల్లోకి వెళితే.. రతి సాగర్ ఎక్ష్ప్రెస్ రైలులో రవి యాదవ్ తన సోదరితో కలిసి ప్రయాణిస్తున్నాడు. అయితే జీరోలి గ్రామానికి చేరుకోగానే ప్రాంటీ సిబ్బందితో అతనికి గొడవ జరిగింది. వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తున్న సమయంలో పాన్ మసాలా ఎందుకు తింటున్నావ్ అంటూ ప్రశ్నించాడు రవి యాదవ్. అయితే గొడవ పెరిగిపోవడంతో రవి యాదవ్ చెల్లి లలిత్పూర్ స్టేషన్ రాగానే రైలు దిగిపోయింది.

 అటు రవి యాదవ్ను మాత్రం సిబ్బంది రైలు దిగనివ్వలేదు. దారుణంగా అతడిని కొట్టడమే కాకుండా రైలులో నుంచి కిందకు తోసేశారు. ఈ క్రమంలోనే గమనించిన స్థానికులు అతన్ని హాస్పిటల్కి తరలించారు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు అన్నది తెలుస్తుంది. అయితే ఝాన్సీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నా రవి యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇప్పటికే నిందితుల్లో ఒకరైన అమిత్ ను గుర్తు పట్టగా అతనిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: