పోలీస్ ముక్కు,చెవులు కోసేసిన కామన్ మ్యాన్.. కారణం తెలిస్తే షాకే?

praveen
సాధారణంగా పోలీసులు అంటే ఎంతో బాధ్యతాయుతంగా మెలగాల్సిన ఉంటుంది అన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే అటు ప్రజలకు ఏదైనా సమస్య వచ్చిందంటే చాలు ముందుండి ఆ సమస్యను పరిష్కరించాలి. కానీ ఇటీవలి కాలంలో కొంత మంది పోలీసులు ఖాకీ చొక్కాకే మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బాధ్యతాయుతంగా మెలగాల్సింది పోయి దారుణమైన పనులకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఒక మహిళను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న పోలీసు అధికారి పై ప్రతీకారం తీర్చుకున్నాడు సదరు మహిళ భర్త.

 తన తో అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ బలవంతం చేయడంతో ఇక ఏకంగా పోలీసు ముక్కు చెవులు కోసేసాడు ఆమె భర్త. అంతకు ముందు సదరు పోలీసు పై తీవ్రంగా దాడి చేశాడు అని చెప్పాలి. ఈ ఘటన పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్లో వెలుగులోకి వచ్చింది. ఝాంగ్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఇఫ్టికార్ తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు.  అయితే అతను ఇంట్లో లేని సమయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కాసీం హయత్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి తన భార్య తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని... అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ బలవంతం చేయడం చేస్తున్నాడని ఇఫ్తికర్ ఆరోపించాడు.

 అయితే ఈ విషయంపై న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన వారు పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇటీవలే కానిస్టేబుల్ పై  పగ పెంచుకున్న సదరు వ్యక్తి. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్ను ఓ ప్రాంతంలో అడ్డుకున్నాడు. ముందుగా అతనిపై దాడికి పాల్పడి ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ముక్కు చెవుల తో పాటు తదితర అవయవాలకు కూడా కోసేశాడు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ సమీప ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: