ఒక్క పిడుగు పాటు.. మూడు కుటుంబాల్లో విషాదం నింపింది?

praveen
మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిది అని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అందుకే మనిషిని ఎన్నేళ్ల పాటు భూమిమీద ఉంచాలి.. ఎప్పుడు ప్రాణాలను తుంచేయాలి అన్నది ఆ దేవుడికే తెలుస్తుంది అని అంటూ ఉంటారు పెద్దలు. అయితే నేటి రోజులలో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తున్నా  కొన్ని కొన్ని సార్లు కొంతమంది విషయంలో అనుకోని విధంగా మృత్యువు దరిచేరుతూ ఉండటం చూస్తూ ఉంటే మాత్రం పెద్దలు చెప్పింది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని రీతిలో మృత్యువు కబళించి కుటుంబంలో విషాదం నింపుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఇటీవలి కాలంలో ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా ఇలాంటి విషాదకరమైన ఘటన గురించి.  పొలం పనుల్లో మామకు సహాయం చేద్దామని ఇద్దరూ అల్లుళ్లు వెళ్లారు.  కానీ అక్కడే పిడుగు రూపంలో మృత్యువు వేచి చూస్తోంది అన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. ఇద్దరూ అల్లుళ్లు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. ఈ విషాదకర ఘటన కొమరం భీమ్ జిల్లా వాంకిడి మండలంలో వెలుగులోకి వచ్చింది. ఒక్క పిడుగుపాటుతో 3 కుటుంబాల్లో విషాదం నిండిపోయింది.

 కోమటి గూడ గ్రామానికి చెందిన వడ్డెరే సంతోష్ (36)ఆసిఫాబాద్ మండలంకు చెందిన ఆదే సంతోష్ (34) తోడల్లుళ్లు. అయితే ఇటీవలే వాంకిడి మండలం తేజాపూర్ గ్రామంలోని మామ రామచంద్ర ఇంటికి వచ్చారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో కలిసి పత్తి చేనులో  ఎరువులు వేయడానికి వెళ్లారు ఇద్దరూ అల్లుళ్లు. ఇక ఎరువుల వేస్తున్న  సమయంలో వర్షం రావడంతో ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు బొలెరో వాహనంలో బయల్దేరగా.. ఇక ఇద్దరూ అల్లుళ్లు ద్విచక్రవాహనంపై  బయల్దేరారు. దీంతో ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ క్రమంలోనే ఇద్దరు అల్లుళ్లు  అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇద్దరూ అల్లుళ్ల కుటుంబాలతో  పాటు అటు మామ కుటుంబంలో కూడా విషాదం నుండి పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: