షాకింగ్ : చంపింది ఎవరో తెలిసిపోయిందిగా?
ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంతో చాకచక్యంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జహీరాబాద్ రామ్ నగర్ కు చెందిన బోయిన మహేష్, కర్ణాటక రాష్ట్రం కల్బుర్గి జిల్లాకు చెందిన అనిల్కుమార్ బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. అడ్డా కూలీలుగా పనిచేస్తూ ఫుట్పాత్ ల పైనే జీవనం సాగిస్తూ ఉండేవారు. అంతేకాదు ఇక ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తులను బెదిరించి డబ్బులు లాక్కొని వాటితో జల్సాలు చేయడం అలవాటు పడ్డారు.
ఈ క్రమం లోనే ఈ నెల 24వ తేదీన లకిడికపూల్ బస్టాప్ వద్ద నిద్రిస్తున్న యాచకుడు దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతను ఇవ్వకపోవడం తో చివరికి కత్తితో గొంతు కోసి జేబులో ఉన్న 160 రూపాయలు నగదు తీసుకుని అక్కడి నుంచి పారి పోయారు. అయితే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు అతని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమం లోనే చివరికి చికిత్స పొందుతూ సదరు యాచకుడు మృతి చెందాడు. సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు మహేష్, అనిల్ కుమార్ నిందితులుగా గుర్తించి వారి కోసం గాలించి అదుపు లోకి తీసుకున్నారు. చివరికి రిమాండ్కు తరలించారు.