కోడిపుంజుకు దశదినకర్మ.. ఎందుకో తెలిస్తే షాకే?
కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ఎంతో ప్రేమగా పెంచుకున్న కోడిపుంజుకు దశదినకర్మ నిర్వహించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు ఈ దశ దిన కర్మ లో 500 మందికి భోజనాలు కూడా పెట్టించారు. ఈ విచిత్రమైన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంది. ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. యూపీలోని ప్రతాప్ గడ్ జిల్లాలో ఇలా కోడికి దశదినకర్మ నిర్వహించడం చూసి స్థానికులు సైతం ఆశ్చర్యంలో మునిగిపోయారు. ప్రతాప్గఢ్ కు చెందిన ఓ కుటుంబం తమ పెంపుడు కోడి చనిపోవడంతో ఎంతగానో బాధ లో మునిగిపోయారు.
ఈ క్రమంలోనే సాంప్రదాయబద్ధంగా ఆ కోడి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఇక మనుషులు చనిపోతే చేసినట్లుగానే దశదినకర్మ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. దీంతో ఇది కాస్త అటు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఈ కోడిపుంజు మృతి వెనుక కారణం తెలిసి ఇంకొంతమంది షాక్ అయ్యారు అని చెప్పాలి. ఆ కోడి పుంజు పేరు లాలి. అయితే ఇటీవలే ఓ రోజు నెల వయస్సు ఉన్న గొర్రెపిల్లను ప్రాణాలకు తెగించి కాపాడింది. గొర్రె పిల్ల పై వీధి కుక్క దాడి చేస్తున్న సమయంలో కోడి గమనించి కుక్కతో వీరోచితంగా పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయింది. గొర్రె పిల్ల ప్రాణాలతో బయట పడింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు ఆ కోడి త్యాగానికి అంత్యక్రియలు నిర్వహించి దశదినకర్మ నిర్వహించారు.