భార్య, భర్తల గొడవలు రావడం సహజం అయితే వాటిని త్వరగా తగ్గించె పని చెయ్యాలి లేకుంటే గొడవలు పెరిగి చనిపొయె ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని సార్లు ఆ గొడవల వల్ల కోపంతో ప్రాణాలు పోగొట్టు కోవడం లేదా ప్రాణాలు తీయ్యడం చేస్తారు.. అలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి..తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది..భర్త జీన్స్ వేసుకోవద్దని అన్నాడు.దాంతో కోపంతో రగిలి పోయింది.. భర్తను అతి దారుణంగా పొడిచి చంపింది..
మనుషులు కంట్రోల్ తప్పుతున్నారు. చిన్న చిన్న విషయాలకే మర్డర్లు చేసేస్తున్నారు. కోపంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు..జీన్స్ ప్యాంటు ఎందుకు వేసుకున్నావు అని అడిగిన పాపానికి.. ఓ
భార్య ఏకంగా తన భర్తనే
హత్య చేసింది. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్‌లో జరిగింది. అసలు విషయాన్నికొస్తే..పెళ్లి తర్వాత జీన్స్ ధరించడానికి ఒప్పుకోలేదని ఓ మహిళ తన భర్తనే కత్తితో పొడిచి చంపేసింది. జార్ఖండ్‌లోని జామ్తారా పోలీస్ స్టేషన్ పరిధిలోని జోర్భితా గ్రామంలో ఈ ఘోరం చోటు చేసుకుంది...
పుష్పా హెంబ్రోమ్ అనే మహిళ శనివారం రాత్రి జీన్స్ ప్యాంటు ధరించి గోపాల్‌పూర్ గ్రామంలో జరిగే జాతర చూసేందుకు వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చాక ఆమె వస్త్రధారణపై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
పెళ్లి తర్వాత జీన్స్ ఎందుకు ధరించావని
భర్త ప్రశ్నించాడు.
భర్త అలా ప్రశ్నించడాన్ని
భార్య తట్టుకోలేకపోయింది. జీన్స్ ప్యాంటు వేసుకుంటే తప్పేంటి? అనే రీతిలో ఆమె గొడవకు దిగింది.ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి గురైన
భార్య పుష్ప.. భర్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ధన్‌బాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. తన కొడుకు, కోడలి మధ్య జీన్స్ ధరించే విషయంలో గొడవ జరగడంతో.. తన కొడుకుని కత్తితో పొడిచి చంపినట్టు మృతుడి
తండ్రి తెలిపారు..ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. వివరాలు తెలియాల్సి ఉంది..