లవర్ పెళ్ళికి ఒప్పుకోలేదని.. యువకుడు ఏం చేసాడో తెలుసా?

praveen
ప్రేమ అంటే ఒక మధురమైన అనుభూతి. ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత జీవితాంతం గుర్తుండేలా జ్ఞాపకాలు అందరి మనసులో చేరిపోతాయి అని చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎందుకంటే ప్రేమించిన కారణానికి కొంత మంది ప్రాణాలు కోల్పోతుంటే. ప్రేమ ను తిరస్కరించిన కారణానికి మరికొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది ప్రేమోన్మాదులు రెచ్చిపోయి దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు  అందరిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నిజాంబాద్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా దారుణమైన ఘటన వెలుగు చూసింది.


 మోపాల్ మండలం చిన్న పూర్ కు చెందిన ఓ యువతికి నిజాంబాద్ రూరల్ మండలం కు చెందిన సంజయ్ కుమార్ కు మధ్య మూడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తుంది. బంధువుల ఇంట్లో ఫంక్షన్ సందర్భంగా యువతితో ఏర్పడిన పరిచయం కొన్నాళ్ళకే ప్రేమగా మారి పోయింది. అయితే ఇటీవలే సంజయ్ కుమార్ బలవంతంగా సదరు యువతిని సాయిబాబా ఆలయానికి తీసుకు వచ్చాడు. మళ్లీ ఇంటి దగ్గర దింపే సమయంలో అప్పటికే చీకటి పడటంతో నిర్మానుష్య ప్రాంతంలో వాహనం ఆపి తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. కానీ అందుకు యువతి నిరాకరించింది. కోపంతో ఊగిపోయి విచక్షణ కోల్పోయిన సంజయ్ కుమార్ గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు.


 ఆ తర్వాత పక్కనే ఉన్న బీరు సీసా పగలగొట్టి గాజు ముక్క తో యువతి గొంతుకోశాడు. చివరికి రక్తపుమడుగులో ఉన్న యువతిని చూసి చనిపోయిందని  సంజయ్ కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. మరునాడు ఉదయం వాహనదారులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను పిలిచారు. అయితే అప్పటికే కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సదరు యువతిని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటుంది. అయితే బాధితురాలు గత కొంతకాలంగా దూరంగా ఉండటం నేపథ్యంలోనే పగ పెంచుకుని ఇలా దాడి చేసి ఉంటాడని తెలుస్తుంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: