అక్రమ సంబంధాల మోజులో పచ్చటి సంసారాల ను నాశనం చేసుకుంటున్నారు.. ఈరోజుల్లో ఇలాంటి బంధాలు కాస్త ఎక్కువగా వినిపిస్తున్నాయి.. వాటి కోసం అయిన బంధాల ను కూడా విడిచి పెడుతున్నారు. ముఖ్యంగా మహిళల అక్రమ సంబంధాలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మోజులో పడి ఎందరో తమ మాన ప్రాణాలను తీసుకుంటూన్నారు..తాజాగా ఘటన వెలుగు లోకి వచ్చింది. తాజాగా.. ఓ మహిళ పొరుగింటి వ్యక్తితో కలిసి పారిపోయింది.
తీవ్ర మనస్థాపం చెందిన
భర్త బలవన్మరణాని కి పాల్పడ్డాడు. ఈ ఘటన
హర్యానా లోని గురుగ్రామ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్ లోని
గౌతమ్ బుద్
నగర్ జిల్లా నివాసి అయిన కవిందర్ గురుగ్రామ్ లోని కసన్ గ్రామం లో కుటుంబం తో కలిసి నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ కంపెనీ లో పని చేయడం తో పాటు క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న అతడి
భార్య రీనా పొరుగింటి వ్యక్తి రామ్‌వీర్ తో కలిసి వెళ్లిపోయింది. దీనిపై కవిందర్ మనేసర్ పోలీసుల కు ఫిర్యాదు చేశాడు.
భార్య చేసిన పనికి కవిందర్ తీవ్ర మనస్థాపం చెందాడు.
ఈ నేపథ్యం లో బుధవారం ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న కవిందర్‌ను గమనించిన సోదరుడు సంతోష్ కుమార్.. వెంటనే సమీపం లోని ఆసుపత్రి కి తీసుకెళ్లాడు. అయితే కవిందర్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కవిందర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృత దేహాన్ని బంధువుల కు అప్పగించారు. సోదరుడు సంతోష్
కుమార్ ఫిర్యాదు తో మృతుడి
భార్య రీనా, ఆమె ప్రేమికుడు రాంవీర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.