పెళ్లి చేసుకోమన్న 53 ఏళ్ల వ్యక్తి.. నిరాకరించిన మహిళ.. కానీ చివరికి?
పెళ్లికి నిరాకరించిన ఓ ప్రియురాలు దారుణ హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుచి జిల్లా నొచ్చియం కోళ్లడం నదిలో గత నెల 11వ తేదీన 35 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో గుర్తించారు స్థానికులు. ఈ క్రమంలోనే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించా.రు ఈ క్రమంలోనే హత్యకు గురైనట్లు తేలింది. అయితే నమోదు చేసుకున్న శ్రీరంగం పోలీసులు విచారణ చేపట్టారు. ఇక పోలీసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు పాల్పడింది లాల్గుdi సమీపంలోని ఒక స్టోర్ యజమాని అనేది తేల్చారు.
కాగా ఏడు నెలల క్రితమే భర్త మృతిచెందడంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఒంటరిగానే ఉంటోంది సదరు మహిళ. ఈ క్రమంలోనే సెల్వీ సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేయగా.. ఇక లాల్గుడి కి చెందిన ఫ్యాన్సీ స్టోర్ యజమాని 53ఏళ్ల నాగరాజు ఆమెతో తరచూ ఫోన్ మాట్లాడినట్లు విచారణలో తేలింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో సెల్వి తో వివాహేతర సంబంధం ఉన్న విషయం బయట పెట్టాడు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని కానీ ఆమె పెళ్లికి నిరాకరించడంతో చివరికి నది వద్దకు తీసుకెళ్లి ఇనుప రాడ్ తో కొట్టి హత్య చేసి నదిలో పడేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఇక అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.