అయ్యో పాపం.. పనిచేస్తున్న ఆస్పత్రిలోనే.. ప్రాణం వదిలాడు?

praveen
పెళ్లై ఏడాది మాత్రమే  అయ్యింది..  జీవితం సంతోషంగా సాగిపోతూ ఉంది. ప్రస్తుతం భార్య 8 నెలల గర్భవతి. మరి కొన్ని రోజుల్లో వీరి దాంపత్య బంధానికి ప్రతిరూపంగా  వారికి ఒక బిడ్డ కూడా పట్టబోతుంది. అంతలో వారి జీవితంలో ఊహించని షాక్ తో విషాదం నిండి పోయింది. వారి దాంపత్య జీవితంలో రోడ్డు ప్రమాదం అరణ్యరోదన మిగల్చింది. స్నేహితుడితో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందడంతో ఇక ఆ యువతి అరణ్య రోదనగా విలపించింది. ఈ విషాదకర ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.


వివరాల్లోకి వెళితే.. సూరారం కాలనీ కి చెందిన మహేష్ మొయినా బాద్ కు చెందిన పావని తో ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే అతను సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ లో పని చేస్తున్నాడు. సంసారం అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఇటీవలే విధి వారి విషయంలో ఆగ్రహించింది. అయితే తనతో పాటు పనిచేసే స్నేహితుడు అఖిల్ తో కలిసి ఇటీవల ద్విచక్రవాహనంపై అన్నారం ఏదో పని మీద వెళ్ళాడు. అయితే తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో గాగిల్లాపూర్ వద్ద వాహనం అదుపు తప్పి ఒక్కసారిగా భారీ క్రేడ్ లను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు మహేష్.


 దీంతో వెంటనే అతన్ని సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ కి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ చివరికి మహేష్ తుదిశ్వాస విడిచాడు. ఇలా తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోనే ప్రాణాలు వదిలాడు. స్నేహితుడు అఖిల్ మాత్రం గాయాలతో బయట పడ్డాడు అని తెలుస్తుంది. అఖిల్ కి తల్లిదండ్రులు ఎవరు లేదు. రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఇక మరో వైపు మహేష్ మృతిచెందిన నేపథ్యంలో ఇక అతని భార్య అరణ్యరోదనగా విలపించింది. అయితే ఇటీవల కాలంలో ఇలా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని  సూచించినప్పటికీ ఎవరు మాట వినకుండా చివరికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: