5గురు స్మగ్లర్లు అరెస్ట్.. బెహ్రేయిన్ నుంచి ఏం తెచ్చారో తెలుసా?

praveen
ఇటీవలికాలంలో ఎక్కడ చూసినా అటు స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. దేశవిదేశాలలో మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక స్మగ్లర్లు ఎంచుకునే దారులు కొన్ని కొన్ని సార్లు ఏకంగా అధికారులకు సైతం షాక్ ఇస్తున్నాయి అన్న  విషయం తెలిసిందే. నేటి రోజుల్లో ఇలా స్మగ్లింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు.  ఇలాంటి సమయంలోనే స్మగ్లర్లు వినూత్నమైన రీతిలో కొత్త ప్లాన్లు వేస్తున్న తీరు మాత్రం అధికారులకు సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.

 ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఎయిర్పోర్టులో ఇతర దేశాల నుంచి భారత్ లోకి మాదకద్రవ్యాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎంతో మందిని అరెస్టు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. అయితే ఇలా ఇప్పటికే ఎంతోమంది కటకటాల వెనక్కి పోయినప్పటికీ స్మగ్లర్లు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.  ఏదో ఒక విధంగా నిషేధిత డ్రగ్స్ ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏకంగా ఐదుగురు స్మగ్లర్లను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఇక్కడ స్మగ్లర్లు మాదకద్రవ్యాలను అక్రమ రవాణా చేయలేదు. కానీ వారి వద్ద నుంచి భారీ స్థాయిలో సిగరెట్లను బ్యూటీ క్రీమ్స్ ని  చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.

 ఏకంగా 1.59 లక్షల రూపాయల నగదుతో పాటు 800 సిగరెట్లు 830 ఈ సిగరెట్లు, బ్యూటీ క్రీమ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక వీటి విలువ దాదాపు 2 4.29 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఇలా స్మగ్లింగ్కు పాల్పడిన వారు బహ్రెయిన్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తోం.ది ఇక ఐదుగురు పై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు అనే చెప్పాలి. ఇలా ఏకంగా సూట్ కేసులో  భారీగా సిగరెట్లు బ్యూటీ క్రీమ్స్ కూడా బయటపడటం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: