ప్రేమ పెళ్లి.. అయినా యువతికి సూసైడ్ తప్పలేదు?

praveen
కట్నం తీసుకోవడం నేరం అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇటీవలి కాలంలో కట్నం తీసుకోకుండా ఇవ్వకుండా అసలు పెళ్లిళ్లు జరగడం లేదు అన్నది అందరికీ తెలిసిన నిజం. సరే కట్నం తీసుకున్న తర్వాత అయినా మెట్టినింట్లో  అడుగు పెట్టిన ఆడపిల్లలను సంతోషంగా చూసుకుంటున్నారా అంటే ఇక పెళ్ళయిన కొన్ని నెలలకే అదనపు కట్నం కోసం వేధించడం మొదలు పెడుతున్నారు. చివరికి ఎంతో కష్టపడి ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి చేసి ఇచ్చినా కూడా అటు కూతురుకి సంతోషాన్ని తెచ్చి ఇవ్వలేకపోతున్నారు అని చెప్పాలి.

 ఇలా వరకట్న వేధింపుల నేపథ్యంలో అదనపు కట్నం కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక మెట్టినింటి వారి వేధింపులు భరించలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. వరకట్న వేధింపులకు మరో గృహిణి బలైంది. హైదరాబాద్ నగరంలోని చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం బసవ కళ్యాణ్ కు చెందిన పవన్ కుమార్ తండ్రితో కలిసి కొన్నేళ్లుగా చంద్రయాన్ గుట్ట న్యూ ఇంద్ర నగర్ లో నివసిస్తున్నాడు. అయితే పాతబస్తీలో ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన జ్యోతి కుటుంబం కూడా అదే ప్రాంతంలో ఉంటుంది.

 వీరిద్దరి మధ్య ఏర్పడగా.. పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇక వీరిద్దరూ ఇటీవల ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి మరోసారి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే  వారంలో రెండు మూడు సార్లు అత్త శకుంతల జ్యోతి ఇంటికి వచ్చి వెళుతూ ఉండేది. అయితే ఇటీవల జ్యోతి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కాక జ్యోతి సూసైడ్ నోట్ రాసింది అనే విషయాన్ని గుర్తించారు. అదనపు కట్నం కోసం వేధించారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది జ్యోతి. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: