మైనర్ కూతురుకి రహష్యంగా పెళ్ళి చేసిన తల్లి..మ్యాటర్ ఇదే?

Satvika
పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం తల్లి దండ్రులు శ్రద్ద వహించాలి..వారు మరోసారి ఆ తప్పులు చెయ్యకుండా చూసే భాధ్యథను తీసుకోవాలి..అలా కాకుండా తప్పులను కప్పి పుచ్చుకుంటూ మరో తప్పు చేస్తే  అది మహా పాపం అవుతుంది.ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి..ఆడ పిల్లల విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది.ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. 16 ఏళ్ల కూతురికి ఓ తల్లి రహస్యంగా పెళ్లి చేయాలని చూసింది. అంతకుముందు రోజు ఆమె చేసిన నీచమైన పని తెలుసుకుని అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తన కూతురు కడుపును దాచి పెట్టింది... ఇంట్లోనే పురుడు పోసి మరో తప్పు చేసింది..ఆ తరువాత ఆ బిడ్డను చెత్త కుప్పలో పడవేసి, ఆ మరుసటి రోజే మరో వ్యక్తి తో పెళ్లి చేసింది.ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఇజ్జత్‌నగర్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ 16ఏళ్ల బాలికకు ఇటీవల వరసకు బావ అయ్యే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. బంధువు కావడంతో ఆ యువకుడు కొన్నాళ్లు బాలిక ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పెద్దలకు తెలీకుండా ప్రేమ వ్యవహారం నడిపారు. కొన్నాళ్లకు బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో బాలికకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని చూశారు. అయితే ఆమె గర్భవతి అని తెలియడంతో వివాహం చేసుకునేందుకు వారు నిరాకరించారు. శిశువును వదిలేసి వస్తేనే పెళ్లి చేసుకుంటానని కండీషన్ పెట్టాడు..

వారం రోజుల క్రితం బాలికకు పురిటి నొప్పులు వచ్చాయి. బయట ఆసుపత్రికి తీసుకెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ప్రసవం చేసింది. అనంతరం శిశువును సంచిలో వేసి, మురుగు కాలువలో పడేసింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. మరుసటి రోజు రహస్యంగా వివాహం చేయించింది. అయితే పోలీసులు శిశువును రక్షించి, CWC అధికారులకు అప్పగించారు. బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి, బాలిక తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం బాలికను విచారించిన అనంతరం శిశువును కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు CWC అధికారులు తెలిపారు..ఈ విషయం బయటకు పొక్కడం తో స్థానికంగా కలకలం రేపుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: