ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త సుమీ..మహిళలు బీ కేర్ ఫుల్..

Satvika
కొందరు దుర్మార్గులు అమ్మాయిలకు తెలియకుండా వారి ఫోటోలను వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చెయ్యడం లేదా ఇంటర్నెట్ లో పెట్టడం చెస్తున్నారు.తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని మహిళలు గమనించారు. ఇదే సమయంలో దొంగలు సంచరిస్తున్నారని ప్రచారం జరిగింది. సాయంత్రం ఓ మహిళ ఇంటి బయట ఉన్న బాత్ రూమ్ లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఓ నిందితుడు గోడ మీద నుంచి ఫోటోలు, వీడియోలు తీశాడు.

అది గమనించిన మహిళ గట్టిగా కేకలు వేసింది.గోడదూకిన నిందితుడు సమీపంలోని పార్క్ లోకి పారిపోయి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్ పరిశీలించగా అందులోని ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అయ్యారు.తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని పెరుమాల్ పురం ఏరియాలో శ్రీమంతులు, పెద్దపెద్ద వ్యాపారాలు చేస్తున్న వారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న మగాళ్లు ఉదయం ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతున్నారు. పగటి పూటా చాలా మంది మహిళలు వారి ఇంటి పనులు చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు.


ఆ ఏరియాలో రాబిన్ సన్ అనే వ్యక్తి వుండేవాడు.ఎవ్వరికి అనుమానం రాకుండా తిరుగుతున్న రాబిన్ సన్ మహిళలు స్నానం చేస్తున్న సమయంలో, వాళ్లు బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి ఎవ్వరికి అనుమానం రాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు..అదే విధంగా ఓ రోజు మహిళ స్నానం చేస్తున్న సమయంలో ఫోటోలు తీశాడు.అది గమంచి ఆ మహిళ కేకలు వేసింది.పోలీసులు రాబిన్ సన్ మొబైల్ ఫోన్ పరిశీలించగా అందులోని ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అయ్యారు. అనేక మంది మహిళలు స్నానాలు చేస్తున్న సమయంలో, బట్టలు మార్చుకుంటున్న సమయంలో రాబిన్ సన్ ఫోటోలు, వీడియోలు తీశాడని తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు..అతను ఆ ఫోటోలను ఎవరికైనా షేర్ చేశాడా లేదా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: