
ఇష్టపడి పెళ్లి చేసుకున్న.. ఇప్పుడు ఇష్టపడి చనిపోతున్నా?
ఇక్కడ ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం గా మారిపోయింది. బెంగుళూరు లో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. చిక్కమగళూరు జిల్లా చూడనహళ్లికీ చెందిన అంజు ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇక నాలుగు నెలల క్రితమే ఆంజన్ కానియర్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అతను బెంగళూరులోని ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది అంజు. భర్త ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి చూడగా ఊరికి వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయాడు.
ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సంఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ లభించింది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను.. ఇక ఇప్పుడు ఇష్టపడి ఆత్మహత్య చేసుకుంటున్నాను.. క్షమించు అమ్మ అంటూ రాసి ఉండటం గమనార్హం. నా మానసిక స్థితి సరిగా లేదని.. ఏమి చేస్తున్నానో నాకే తెలియడం లేదని.. వెన్నునొప్పి ఉంది అంటూ ఆ లెటర్ లో రాసింది ఆమె. అయితే అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తనతో తన కూతురు చెప్పేదని భర్త అత్తమామల వేధింపులు వల్ల ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉండడం గమనార్హం.