తనతో రాకుంటే చంపేస్తానని బెదిరించిన మాజీ ప్రియుడు..చివరికి..

Satvika
పెళ్ళి చేసుకోనే ముందు అటు ఏడు తరాలు,ఇటు ఏడు తరాలు చూసి చెయ్యమని పెద్దలు చెబుతున్నారు. ఇప్పుడు పెళ్ళి అనగానే మంచి వాళ్ళు లాగా నటిస్తున్నారు.. పెళ్ళయిన తర్వాత అసలు రూపాన్ని బయట పెడుతున్నారు..ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో ఘటన జరిగింది.. ఓ వ్యక్తి తో యువతికి నిష్చితార్థమ్ చేశారు.. తర్వాత అతను మంచి వాడు కాదని తెలుసుకొని కూతురు జీవితాన్ని నాశనం చెయ్యలేక దాన్ని ఆ యువతి తల్లి దండ్రులు క్యాన్సిల్ చేశారు.


తర్వాత వేరే వ్యక్తిని చూసి పెళ్ళి చేశారు.అయితే అది మనసులో పెట్టుకున్న మొదటి పెళ్ళి కొడుకు ఆమెను వేధింపులకు గురి చేసేవాడు..తన భర్తకు కూడా ఫోన్ చేసి యువతిని చంపెస్తానని బెదిరించాడు. కానీ ఆ మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదు. అతను సీరియస్ అయ్యాడు.ఓ రోజు చెప్పినట్లే ఇంటికి వచ్చాడు. ఆమెను అతి దారుణంగా కాల్చి చంపాడు..ఈ ఘటన బీహార్‌లోని సుందర్‌వాస్‌కు చెందిన నేహా కుమారికి నాలుగేళ్ల క్రితం శక్తి సింగ్‌తో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముహూర్తం కూడా కుదిరింది. దీంతో శక్తి సింగ్, నేహ కలిసి తిరిగే వాళ్లు. ఫోన్ల ద్వారా గంటల కొద్దీ మాట్లాడుకునే వాళ్లు..


ఆ క్రమంలో మనసులు కలిసాయి..అయితే ఆ యువకుడికి సంబంధించి కొన్ని రహస్యాలు తెలియడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లి రద్దు చేశారు.నేహ తల్లిదండ్రులు ఆ పెళ్లిని రద్దు చేశారు. ఏడాది తర్వాత చందన్ సింగ్‌తో నేహకు వివాహం చేశారు. నేహకు వివాహం జరిగి, ఓ కూతురికి తల్లి అయిన తర్వాత కూడా శక్తి ఊరుకోలేదు. నేహకు, ఆమె భర్త చందన్‌కు ఫోన్లు చేసి బెదిరించేవాడు. భర్త, కూతురిని వదిలేసి తనతో రాకపోతే చంపేస్తానని బెదిరించాడు.గురువారం సాయంత్రం ఇంట్లో నేహ తన కూతురితో కలిసి ఉంది. ఆ సమయంలో మరొక వ్యక్తితో కలిసి శక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో నేహ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనికి కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: