కుటుంబ నియంత్రణ కోసం వెళ్తే.. ప్రాణం తీసిన డాక్టర్లు?

praveen
కరోనా వైరస్ కాలంలో డాక్టర్లే ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వైరస్ ఎక్కడ ప్రాణాలు తీస్తుందో అని భయపడి అందరూ ఇంటి పట్టునే ఉంటే డాక్టర్లు మాత్రం ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టారు. దీంతో ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ల పై మరింత గౌరవం పెరిగిపోయింది అని చెప్పాలి. కానీ ఇప్పటికి కూడా కొంతమంది డాక్టర్లు నిర్లక్ష్యం కారణంగా చివరికి ప్రజల ప్రాణాల మీదికి తీస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైంది.


 చివరికి పరిస్థితి విషమించి మృతి చెందింది. అయితే ఇక బంధువులు అందరూ కూడా ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టడం గమనార్హం. అధికారులు ఈ విషయంపై స్పందించి ప్రైవేట్ ఆసుపత్రికి సీలు వేశారు. ఈ ఘటన సేలం జిల్లా లో వెలుగులోకి వచ్చింది. జల గంటాపురం సౌర్య ప్రాంతానికి చెందిన భూపతి భార్య సంగీత ఇటీవలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంది. ఇప్పటికే వీరికి పదకొండేళ్ల కుమార్తె. ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ఆపరేషన్ కోసం 20 రోజుల క్రితం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె ఇంటికి వచ్చింది. కానీ రెండు వారాల తర్వాత తరచూ కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు కుటుంబసభ్యులు.



 ఈ క్రమంలోనే కడుపులో రక్తం గడ్డకట్టింది అని వైద్యులు తెలిపారు. ఇక రెండోసారి ఆపరేషన్ చేశారు ఆ తర్వాత ఇంటికి వెళ్లి మాత్రలు వేసుకుని సంగీత అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి తీసుకు వెళితే మరోసారి ఆపరేషన్ చేయడంతో చివరికి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సంగీత మృతి చెందిందని  కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టగా స్పందించిన అధికారులు ఆసుపత్రిని సీజ్ గమనార్హం. ఈ ఘటన కాస్త సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: