బిర్యాని ప్రియులకు భారీ షాక్.. బల్లి రావడంతో..

Satvika
బిర్యాని అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. ఆ రుచులు అలా ఉండటంతో అందరు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.అయితే రాను రాను బిర్యానికి డిమాండ్ కూడా భారీగా పెరిగి పోతుంది. చిన్న పార్టీలు, ఫంక్షన్స్ ఇలా ఎ చిన్న  అకెషన్ వచ్చిన కూడా బిర్యాని తినడం చేస్తారు. కొన్ని ప్రముఖ హోటల్స్ అయితే డిమాండ్ వుంది కదా అని కొన్ని సార్లు తప్పులను కూడా చేస్తున్నారు. పాడై పోయిన చికెన్ ను అందించడం లేదా బిర్యాని లో ఏదోకటి వస్తున్నా పట్టించుకోవడం లేదు..ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది.


బాగా ఆకలి వేసిందని ఓ వ్యక్తి ఆవురావురుమంటూ బిర్యానిని ఆర్డర్ చేశాడు.. ఇష్టంగా , ఆసక్తిగా ఎదురు చూసిన ఆ వ్యక్తి ముందుకు బిర్యాని వచ్చేసింది..దాన్ని తిందామని ఆత్రుతగా చూస్తున్న వ్యక్తికి ఓ షాక్ తగిలింది.ఆబగా సగం బిర్యానీ తిన్న తర్వాత పగవాడికీ రాని పరిస్థితి అతనికి తలెత్తింది. బిర్యానీలో బల్లి దర్శనమిచ్చింది..ఒక్కసారిగా దాన్ని చూసిన ఆ వ్యక్తికి తిన్న బిర్యాని అంతా వాంతి చేసుకున్నాడు..ఇది ఎక్కడో ఏ మారుమూలో జరగలేదు. మన హైదరాబాద్‌లో.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో ఉండే ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో శుక్రవారం వెలుగుచూసిందీ ఘటన..


వివరాల్లొకి వెళితే..నగరంలోని ఓ ‍ప్రముఖ రెస్టారెంట్‌ నుంచి తెచ్చుకున్న చికెన్‌ బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైంది. రాంనాగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ రెస్టారెంట్‌ నుంచి బిర్యానీ ఆర్డర్‌ చేశాడు. సగం బిర్యానీ తిన్న తర్వాత అందులో బల్లి కనిపించడంతో షాక్‌ అయ్యాడు. దీంతో కంగుతిన్న కార్పొరేటర్‌ చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బిర్యానీని టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్‌కు పంపించారు. అదే విధంగా ఫుడ్‌ ఇన్స్పెక్టర్‌ బిర్యానీ సెంటర్ వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు..అయితే బల్లి పడిన విషయం మాత్రం ఇంకా తెలలేదు.దాంతో అధికారులు మొత్తం సెంటర్ ను సీజ్ చేయాలనీ పోలీసులకు ఆదేశించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: