ప్రియురాలిని గోవా తీసుకెళ్లాడు.. చివరికి ఎంత పని చేసాడు?

praveen
ఇటీవలి కాలంలో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమని ప్రేమించడం లేదని కొంతమంది.. ప్రియురాలు దూరం పెడుతుంది అని మరికొంతమంది.. నాకు దక్కని ప్రియురాలు ఇంకొకరికి జరగకూడదు అని  మరికొంతమంది చివరికి ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్న తీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడుతున్నారు. ఇలా ఇటీవలి కాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇక్కడ ఇలాంటి తరహా  ఘటన వెలుగు చూసింది.

 ఇద్దరు యువతీ యువకులు కూడా కాలేజీ రోజుల నుంచే మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కలిసి చేసేవారు. ఎక్కువ సమయం పాటు ఇద్దరు కలిసి ఉండే వారు అని చెప్పాలి. కానీ ఆ తర్వాత ఏమైందో యువతి అతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఎదురుగా కనిపిస్తే ముఖం తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా పట్టించుకోలేదు.. దీంతో ప్రియురాలిపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు సదరు యువకుడు. ఎలాగైనా ప్రియురాలిపై పగ తీర్చుకోవాలి అని భావించాడు. ఈ క్రమంలోనే  పక్కా ప్లాన్ ప్రకారం గోవా తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.

 ఈ ఘటన గోవాలో వెలుగులోకి వచ్చింది. కలం గుట్కార్ అనే 26 ఏళ్ల యువకుడు యువతిని ప్రేమించాడు.  కాలేజీ రోజుల నుంచి  చెట్టాపట్టాలేసుకుని తిరిగారు  ఇక ఎంతగానో ఎంజాయ్ చేశారూ. కానీ గత కొంత కాలం నుంచి ఆ యువతి అతన్ని దూరం పెడుతుంది. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావ్ అని అడిగిన కూడా సమాధానం చెప్పలేదు. చివరికి ఓ  రోజు నీతో సంబంధం కొనసాగించడం నాకు ఇష్టం లేదు అంటూ ముఖం మీద చెప్పేసింది. దీంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎక్కడికైనా తీసుకెళ్ళి ఆమె మనసు మార్చాలని భావించాడు. కాగా గోవా తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు యువకుడు. డెడ్ బాడీ పొదల్లో వదిలేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: