నా కూతురిని సాకలేను.. పోలీసులకు అప్పగించిన తండ్రి?

praveen
ఒకప్పుడు కూతురు పుడితే భారం అనుకునే వారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే కూతురు వద్దు అని భావించి పుట్టగానే చెత్తకుప్పలో పడేసే వారు. ఇలాంటి ఘటనలు ఎంతోమంది హృదయాన్ని కలచివేస్తు ఉండేవి. కానీ ఇటీవల కాలంలో మాత్రం కూతురు పుడితే అదృష్ట లక్ష్మి అని భావిస్తూ ఉన్నారు. అంతే కాదు కూతురు పుట్టాలని పూజలు పునస్కారాలు చేస్తున్న తల్లిదండ్రులను కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మాత్రం తమకు పుట్టిన కూతురుని సాకలేము  అంటూ ఒక తండ్రి పోలీసులను ఆశ్రయించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 నిజాంబాద్ జిల్లా రెంజల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడు రోజుల పసికందును తాను సాకలేను అంటు ఒక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అయితే సదరు తండ్రి ఇక గుండె భారాన్ని చేసుకొని తన 7 రోజుల పసికందును పోలీసులకు అప్పగించడం వెనుక పెద్ద కారణమే ఉంది అన్నది తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. రెంజల్ కు చెందిన రేణుకకు నీలా గ్రామానికి చెందిన నాగేష్ తో ఏడాది క్రితం వివాహం జరిగింది.  ఇక ఈ నెల ఏడవ తేదీన వీరికి పాప జన్మించింది. అయితే రేణుకకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదు. ఈ క్రమంలోనే  ఆరు నెలల నుంచి పుట్టింట్లోనే ఉంటుంది.

కాగా ఇటీవల రేణుక ఇంటికి వెళ్లిన ఆశా కార్యకర్తలు పుట్టిన పాపకు తల్లి సరిగా పాలు పట్టడం లేదని గుర్తించి వెంటనే భర్తకు సమాచారం అందించారు. దీంతో తండ్రి వచ్చి పాపను తీసుకువెళ్ళాడు. అయితే ఆయన కుటుంబీకులు మాత్రం ఆ పాప బాగోగులు చూసుకోవడం మా వల్ల కాదు అంటూ వారించడంతో చివరికి పాపను తీసుకుని పోలీస్ స్టేషన్ కు  వెళ్లి ఈ ఏడు రోజుల శిశువు ను సాకటం తనవల్ల కాదు అంటూ చెప్పాడు. దీంతో పోలీసులు తిరిగి ఆ శిశువును  తల్లి దగ్గరికి చేర్చారు.  అయితే తండ్రి నాగేష్ ఇటు తల్లి రేణుక కుటుంబ సభ్యులు కూడా శిశువుని వద్దనడంతో  ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: