పెళ్లి.. కానీ అప్పగింతల సమయానికి షాకిచ్చిన వధువు?

praveen
పిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు నీకు ఇష్టమైన చదువు కొనసాగించు అంటూ ఫ్రీడం ఇస్తున్నారు.. నీకు కావాల్సిన బైక్ కొనుక్కో అంటూ స్వేచ్ఛ ఇస్తున్నారూ.. ఎందుకో పిల్లల పెళ్లి విషయంలో మాత్రం ఇప్పటికీ కూడా ఒత్తిడి  చేస్తూనే ఉన్నారు. చదువు విషయంలో ఉద్యోగం విషయంలో కొనుక్కునే బైక్ విషయంలోనీకు ఏది నచ్చితే అది చెయ్యి అంటూ చెబుతున్న తల్లిదండ్రులే... కొత్త జీవితాన్ని ప్రారంభించి జీవితాంతం కలిసి ఉండే  పెళ్లి విషయంలో మాత్రంమూసుకొని మా మాట విని మేము చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకో అంటూ ఒత్తిడి తీసుకు వస్తున్న ఘటనలు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిడి చేసి ఇష్టం లేని పెళ్లి చేస్తున్న కారణంగా ఎంతోమంది యువతులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.

 మరికొంతమంది ఇష్టం లేని పెళ్లి చేసుకొని అత్తారింట్లో సంసారం చేయడం ఇష్టం లేక చివరికి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంకా పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ఇక్కడ తల్లిదండ్రులు చేసిన పనికి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు బలి కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇష్టం లేని పెళ్లి చేసారు అన్న కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఇక వధువు కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

 మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. పట్టణానికి చెందిన పద్మ కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె లక్ష్మీ పదవ తరగతి వరకు చదివి ఇంటివద్దే ఉంటుంది. ఆమెకు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన చిన్నమ్మ కుమారుడు మల్లికార్జునకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించింది పద్మ. అయితే అంత దూరం లో పెళ్లి సంబంధం తనకు ఇష్టం లేదని ఎంత చెప్పినా తల్లి మాత్రం వినిపించుకోలేదు. ఇటీవలే బంధుమిత్రులు అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. కానీ సాయంత్రం అప్పగింతల కు ముందే విషం తాగి చివరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది నవ వధువు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: