షాకింగ్ : వాలంటీర్ ఇంట్లో తుపాకులు?

praveen
ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేరువ చేసేందుకు అటు గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు ప్రజలకు చేరువగా ఉంటూ ప్రభుత్వ పథకాలను అందిస్తూ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక కొంత మంది వాలంటీర్లు అయితే తమ కర్తవ్యాన్ని ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సైతం ప్రభుత్వ పథకాలను చేరేలా చేస్తున్నారు. కానీ మరి కొంత మంది వాలంటీర్లు మాత్రం ఏకంగా బాధ్యతగల ఉద్యోగాల్లో కొనసాగుతూ చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నారు. కొంత మంది వాలంటీర్లు ఏకంగా వృద్ధులకు పింఛన్ డబ్బులు కాజేసి కనిపించకుండా పరార్ అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక మరి కొంతమంది ఏకంగా బాధ్యతగా వ్యవహరించకుండా కొంతమందిపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.  ఇక్కడ మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఎంతో బాధ్యతాయుతంగా ప్రజలకు సేవ చేయాల్సిన వాలంటీర్ ఇంట్లో ఏకంగా తుపాకులు దొరకడం సంచలనంగా మారిపోయింది. రెండు నాటు తుపాకులతో వాటి తయారీ సామాగ్రిని కూడా ఇటీవలే పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది  ఈ ఘటన.

 చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం చింతోపు ఎస్సీ కాలనీకీ చెందిన రవి వాలంటీరుగా పని చేస్తూ ఉన్నాడు. అయితే అతని ఇంట్లో నాటు తుపాకులు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో అతని ఇంటిపై దాడి చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే నాటు తుపాకులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వాటి తయారీ సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.. ఈ క్రమంలోనే  నిందితుడు రవి నీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక పోలీసు విచారణలో రవి తుపాకులు తయారు చేస్తున్న విషయాన్ని ఒప్పుకున్నాడని ఈ కేసులో మరో ఇద్దరు మధ్యవర్తుల పై కూడా ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: