వామ్మో.. అబద్దంతో వెయ్యి మందిని బురిడీ కొట్టించిన ఘనడు..

Satvika
సోషల్ మీడియాలో కొందరు సొమ్ము చేసుకోవడం కోసం వినియోగిస్తున్నారు..ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా బాగా రిచ్ గా ఉన్న అమ్మాయిలకు వల వేసి, వారిని నెమ్మదిగా ముగ్గులొకి దించుతాడు. వారికి కోటిస్వరుడు అని నమ్మించి ప్రేమలో దించుతాడు. మాయచేసి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బుకొట్టేస్తుంటాడా కేటుగాడు..ఇప్పటిదాకా ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు. ప్రాథమిక దర్యాప్తులోనే రూ.2.50 కోట్లు కాజేశాడని నిర్ధారించారు. బాధితుల్లో కొందరి ఫిర్యాదుతో నిందితుడిని సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు..



వివరాల్లొకి వెళితే.. ఏపీ లోని రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ 2014లో బీటేక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చి కూకట్‌పల్లిలో ఉండేవాడు. గుర్రపు పందాలు, క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యసనంలో మునిగిపోయాడు. ఇందుకు డబ్బులు లేకపోవడంతో కూకట్‌పల్లిలో ఒక ప్రైవేట్‌ ట్రావెల్‌ కార్యాలయంలో పనిచేశాడు. ఆ సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమందిని మోసం చేసి డబ్బు గుంజాడు. ఆ తర్వాత పది మందితో కలిసి  జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు.



ఆ తర్వాత బయటకు వచ్చి డబ్బులను ఎలా సంపాదించాలి అనే విషయం పై ఆలొచించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా డబ్బున్న అమ్మాయిలను ఎరవేయాలని పథకం వేశాడు.డబ్బున్న అమ్మాయిలను తెలుసుకునేందుకు మ్యాట్రిమోనియల్‌ సైట్లలో అమ్మాయిల జాబితా చెక్‌ చేశాడు. వాటి ఆధారంగా వారి ఇన్‌స్టాగ్రామ్‌లను సెర్చ్‌ చేసి డబ్బున్న అమ్మాయిల జాబితాను సిద్ధం చేసేవాడు.తర్వాత నమ్మించి డబ్బులు అడిగే వాడు..అలా ఒక్కొక్కరి దగ్గర రూ. 50లక్షల వరకు అడిగేవాడు. దాంతో అతను చెప్పింది నిజం అని నమ్మిన అమ్మాయిలు వెంటనే వారి స్థాయిని బట్టి రూ. లక్షల్లో అతడికి ఇచ్చేవారు..ఆ తర్వాత జల్సాలు చేస్తూ వచ్చాడు. అలా 1000 మంది అమ్మాయిలను మోసం చేసి, రూ. కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికి అతడికి 100కు పైగా నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నట్లు.. ప్రాథమిక దర్యాప్తులో రూ. 2.50 కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది. మొత్తానికి మూడు నెలలు శ్రమించి అతన్ని పట్టుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: