కోరిక తీర్చమన్న ట్యూషన్ మాస్టర్.. విద్యార్థిని ఏం చేసిందో తెలుసా?
లైంగిక వేధింపులకు పాల్పడటమే కాదు బయట విషయం ఎవరికీ చెప్పకుండా విద్యార్థులను బెదిరింపులకు పాల్పడిన ఘటనలు కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇలా ఇటీవలి కాలంలో టీచర్ వృత్తికి కలంకం తెచ్చే విధం గా ఎంతో మంది కామాంధులు వ్యవహరిస్తున్నారూ. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. లైంగిక వాంఛ తీర్చాలి అంటూ ట్యూషన్ మాస్టర్ వేధిస్తున్నాడని పదిహేడేళ్ల విద్యార్థి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన రేపల్లెలో వెలుగు లోకి వచ్చింది.
సదరు విద్యార్థి 19 వ వార్డు కు చెందిన ఇసుకపల్లి లో మోపిదేవి శివ కుమార్ నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్ లో చేరింది. విద్యార్థికి పాఠాలు చెప్పాల్సింది పోయి శివ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. విద్యార్థులందరినీ కూడా బయట కూర్చోబెట్టి తనను గదిలోకి తీసుకెళ్లి అసభ్యం గా వ్యవహరించేవాడు అంటూ విద్యార్థిని పోలీసులకు తెలిపింది. ఎవరికైనా చెబితే మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు బహిర్గతం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అని చెప్పుకొచ్చింది. వేధింపులు భరించలేక పోయిన యువతి ధైర్యం చేసి తల్లిదండ్రులకు విషయం చెప్పి వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.