చెల్లెళ్లపై అన్న అత్యాచారం.. అడ్డువచ్చిన తల్లిపై కూడా?

praveen
అసలు ఈ సభ్య సమాజం తీరు ఎటు పోతుంది మానవత్వం ఉన్న మనుషులు చివరికి అడవిలో ఉండే క్రూరమృగాల కంటే దారుణంగా మారిపోతున్నారు. మానవ బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వని మనుషులు సొంత వాళ్ళు అని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేటి రోజుల్లో ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు తరచు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.  మహిళలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కటిన చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు ఆడపిల్ల రక్షణను  ప్రశ్నార్థకంగానే మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే గతంలో బయట ఆకతాయిల నుంచి లైంగిక వేధింపులు ఎదురైన సమయంలో ఇక తమ సమస్యలు ఇంట్లోవారికి  చెప్పుకునే వారు ఆడపిల్లలు. ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పి ఇక సమస్యలు పరిష్కరిస్తారు అని భావించేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఏకంగా ఇంట్లో వాళ్లే లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనస్తాపంతో ఎంతోమంది ఆడపిల్లలు దుర్భర జీవితాన్ని గడుపుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆపదలో నేనున్నాను అండగా నిలవాల్సిన అన్నా చెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

 జార్ఖండ్ లో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లోహార్దాగా జిల్లా లో ఏకంగా సొంత అన్నయ్యే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చెల్లెళ్లను కాటేశాడు. మైనర్లు అయిన ఇద్దరు చెల్లెళ్ళపై మూడు రోజులుగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఇక ఇటీవల మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలు చివరికి తల్లికి అసలు విషయం చెప్పారు. ఈ క్రమంలోనే  అడ్డువచ్చిన తల్లిపై కూడా అత్యాచారానికి ప్రయత్నించాడు ఆ దుర్మార్గుడు. ఈ క్రమంలోనే తల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: