ఠాగూర్ సీన్ రిపీట్.. శవానికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు..

Satvika
ఈ మధ్య సినిమాలను చూసి కొందరు కొన్ని నేర్చుకుంటున్నారు..అవి మంచివి అయితే ఒకే కానీ, చెడువి కూడా ఎక్కువగా చూసి నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా జనాలకు ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని విషయాలను మనం ఇప్పుడు చూస్తున్నాము.. మొన్నీమధ్య చిరంజీవి నటించిన థాకుర్ సినిమా సీన్ ఓ హాస్పిటల్ లో వెలుగు చూసింది. అచ్చం సినిమాలో లాగా శవానికి ఓ హాస్పిటల్ లో వైద్యం చేశారు.. తర్వాత డబ్బులు కట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయ్యింది.


ఇప్పుడు అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. చనిపోయిన వ్యక్తికి వెంటిలేటర్ పై పెట్టి వైద్యం చేశారు. ఏంటో డబ్బుల కోసం ఎంతకైనా తెగించెలా వున్నారు ఈ జనాలు. తెలంగాణలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భూపాలపల్లి జయశంకర్ జిల్లా మల్హర్ మండలం తాడిచర్లలోని ఏఎమ్మార్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న తాళ్లపల్లి కిరణ్ గౌడ్ ప్రమాదవశాత్తు గాయాలై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.. ఓ ప్రైవేట్ కంపెనీ లో ఎలక్ట్రిషన్‌గా పని చేస్తు్న్నాడు. గత గురువారం సాయంత్రం విద్యుత్ స్తంభం పైకెక్కి ఎలక్ట్రికల్ పని చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై కింద పడ్డాడు..


అయితే ఆ కంపెనీ వాళ్ళు దాన్ని రహస్యంగా ఉంచారు..అతన్ని సొమాజిగూడ ఆసుపత్రికి తరలించారు.. బుధవారం మధ్యాహ్నం కిరణ్ గౌడ్ మృతి చెందినట్లు వైద్యులు తెలపడం తో ఆందోళనకు గురైన బాధితుడి తండ్రి రాయమల్లు.. ఏఎమ్మార్ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందించారు. దీంతో టీఎస్‌జెన్కో, ఏఎమ్మార్ కంపెనీ ప్రతినిధులు నిర్వాకంతో చనిపోయిన శవానికి గురువారం మధ్యాహ్నం వరకు చికిత్స చేస్తున్నట్లు ప్రయత్నిస్తూ నటించారు. చివరికి తర్వాత రోజు శవాన్ని అప్పగించారు. ఏడాది క్రితం అతనికి పెళ్ళి అయినట్లు తెలుస్తుంది.కొడుకు అతి చిన్న వయస్సులో మృతి చెందడంతొ అతని తల్లి బొరున విలపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: