కాబోయే అత్తకు.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు?
అందుకే పెళ్లిని ఎంతో సీరియస్ గానే తీసుకుంటారు. పెళ్లి విషయంలో ఎవరూ కూడా జోక్ లాంటివి చేయరు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతోమంది ఏకంగా పెళ్లిని కూడా మోసాలు చేయడానికి వాడుకుంటూ వుండడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో పెళ్లి పేరుతో అమాయకులకు గాలం వేసి భారీగా డబ్బు దండుకుంటున్నారు కొంతమంది. అయితే నిత్య పెళ్లి కూతురు గా ఉంటూ ఎంతోమందిని పెళ్లి చేసుకొని చివరికి నగలు నగదు తో పారిపోతూ అత్తింటి వారికి షాక్ ఇస్తున్నారు మరికొంతమంది. ఇలా కొంత మంది యువతీ యువకులు పెళ్లి ని మోసాలకు ఆడుకుంటున్న తీరు చూసి అందరూ అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అనే చెప్పాలి. మధ్యప్రదేశ్లోని మందసౌర్లో నివసిస్తున్న ఒక వ్యక్తికి ఆర్తి బింద్ అనే యువతితో వివాహం నిశ్చయమయింది. మరో మూడు రోజుల్లో బంధుమిత్రులందరికీ సమక్షంలో వీరి పెళ్లి జరగబోతుంది. ఇంతలోనే అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది నవవధువు. అత్తారింట్లో అత్త,ఆడపడుచు కి మత్తు మందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత లక్ష రూపాయల నగదు నగలు తీసుకుని పరారయ్యింది. కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు..