అక్షింతలు వేస్తాను అంటూ చెప్పి.. ఇనుప రాడ్ తో కొట్టాడు.. చివరికి?

praveen
నేటి రోజుల్లో ప్రతి ఒక్కరు బిర్యానీ తినడం ఎంత కామన్ గా మారిపోయింది.. అటు హత్యలు చేయడం కూడా అంతే కామన్ గా మారిపోయింది.  అయితే ఈ పోలిక సరిగ్గా సరిపోక పోయినప్పటికి  ప్రస్తుతం జరుగుతున్నది మాత్రం ఇలాంటిదే అని చెప్పాలి. ఎందుకంటే నేటి రోజుల్లో ఎంతోమంది మానవత్వమున్న మనుషులు ఉన్మాదులు గా  మారి పోయి హత్యలకు పాల్పడుతున్నారు. సాటి మనుషుల విషయంలో కాస్త అయినా జాలి చూపించడం లేదు. దీంతో తరచూ ఎన్నో హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.


 ఈ హత్యకు పాల్పడింది ఎవరో కాదు నగల మీద ఆశతో ఏకంగా అర్చకుడు  దారుణానికి పాల్పడ్డాడు అన్న విషయాన్ని పోలీసుల విచారణలో గుర్తించారూ. మురళీకృష్ణ, నగల వ్యాపారి జోషి నందకిషోర్ ను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి ఆభరణాలు హత్య ఉపయోగించబడిన మారణాయుధాలను  స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఇటీవలే ఉమాదేవి  బయటకు వెళ్లి అదృశ్యమైంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అంతలోనే ఆమె మృతదేహం లభ్యమైంది. కానీ ఒంటిపై ఉన్న నగలు మాత్రం కనిపించలేదు. దీంతో ఆభరణాల కోసమే హత్య జరిగినట్లు పోలీసులు భావించి దర్యాప్తు ప్రారంభించారు.


 అయితే విష్ణుపురి ఎక్స్టెన్షన్ కాలనీలో స్వయంభు సిద్ధి వినాయక స్వామి ఆలయం అర్చకుడు మురళీకృష్ణ ఉంటున్నాడు.  ప్రకాశం జిల్లా వాసి అయిన ఇతను బతుకుదెరువుకోసం ఆలయంలో అర్చకునిగా పని చేస్తున్నాడు. రెండేళ్లుగా ఒకే సమయానికి ఉమాదేవి దేవాలయానికి రావడాన్ని గమనించాడు. జల్సాలకు  పోయి అప్పులు చేసిన మురళీకృష్ణ ఉమాదేవిని హతమార్చిన నగలు అపహరించేందుకు  ప్లాన్ వేసాడు. ఈ క్రమంలోనే ఇటీవల సీసీటీవీ  కెమెరాలు పనిచేయకపోవడమె అవకాశంగా తీసుకొని ఇక ఎప్పటిలాగానే గుడికి వచ్చిన ఉమాదేవిని అక్షంతలు వేస్తాను అంటూ చెప్పి దారుణంగా ఇనుప రాడ్ తో కొట్టి చంపేశాడు. రెండు రోజులపాటు మృతదేహాన్ని డ్రమ్ లో దాచాడు.  దుర్వాసన వచ్చింది దీంతో ఆలయ వెనుక భాగంలో చెట్లమధ్య పడేసాడు. నగలను నగల వ్యాపారి అమ్మేస్తాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరకు నిందితులను అరెస్టు చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: