మరికాసేపట్లో పెళ్లి.. అంతలో పోలీసుల ఎంట్రీ.. చివరికి?
ఇక్కడ అంత సీన్ లేదు. ఏకంగా వరుడిని అరెస్టు చేయడానికి వచ్చారు పోలీసులు. ఇంతకీ ఏం జరిగిందంటే ఏకంగా పెళ్లి చేసుకునే యువకుడు పై స్నేహితురాలు అత్యాచారం కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి చివరికి అత్యాచారం చేశాడని ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు అంటూ ఆరోపించింది. ఈ ఘటన ఇండోర్‌లోని విజయనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇక వరుడు అదే రోజు పెళ్లి చేసుకోబోతున్నాడూ అని చెప్పిన యువతి న్యాయం చేయాలంటూ కోరింది.
ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడి ఇంటి ముందు ఊరేగింపు సిద్ధమవుతుండగా అక్కడికి చేరుకుని అతడిని అరెస్టు చేశారు. అనురాగ్ అనే వ్యక్తి ప్రైవేట్ బ్యాంకు లో పని చేస్తుండగా అతనికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. స్నేహితులు కాస్త ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనురాగ్ చివరికి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతికి కనిపించకుండా అదృశ్యమయ్యాడు. అంతలోనే అనురాగ్ వేరే అమ్మాయిని పెళ్లి పెళ్లి చేసుకోబోతున్నాడు అనే విషయం యువతికి తెలిసింది. మరి కొద్ది గంటల్లో పెళ్లి జరగబోతుంది అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి చెప్పిన విషయం విన్న పోలీసు అధికారులు ఆలస్యం చేస్తే బాధితురాలికి న్యాయం చేయలేమని భావించి వెంటనే నిందితున్ని అరెస్టు చేశారు. ఇక అనురాగ్ ఇంటికి చేరుకునే సరికి అక్కడ మరికాసేపట్లో పెళ్ళికొడుకు ఊరేగింపు జరుగుతుంది. అంతలోనే అరెస్టు చేయడంతో అందరూ షాక్ అయ్యారు..