ముందు మనసు దోచాడు.. తర్వాత అంతా దోచేశాడు?
చివరికి అవసరాలు తీర్చుకుని నట్టేట ముంచుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న మహిళ నగరంలోని కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవలే జీవితభాగస్వామి కోసం డైవోర్సి మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసింది సదరు మహిళ. ఇక అలా వెబ్సైట్ చెక్ చేస్తున్న సమయంలో రవి రమేష్ అనే వ్యక్తి వివరాలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఫేస్బుక్ ఖాతా నుంచి అతను వివరాలు సేకరించి మహిళ అతనితో మాట కలిపింది. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఇక సదరు వ్యక్తి అమెరికాలో ఆర్థోపెడిక్ సర్జన్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం టర్కీ మిలిటరీ బేస్మెంట్లో ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నా అంటు మాయమాటలతో నమ్మించాడు.
ఇతర అభిరుచులు కలిశాయి ఇద్దరం కలిసి కొత్త జీవితం ప్రారంభిద్దాం అంటూ ఎన్నో ఆశలు రేకెత్తించాడు. అసోంలోని గుహ వాటిలో తన బంధువులు ఉన్నారంటూ ఒక వాట్సప్ నెంబరు ఆమెకు పంపాడు. ఇక ఆ తర్వాత టర్కీ నుండి వచ్చేందుకు 1500 అమెరికా డాలర్లు చెల్లించాల్సి ఉంది అంటు మాయ మాటలతో బుట్టలో వేసుకున్నాడు. ఇలా 12 ఖాతాలలో దశలవారీగా 34 లక్షల వరకూ సదరు మహిళతో జమ చేయించుకున్నాడు. ఢిల్లీ విమానాశ్రయంలో రవి మనిష్ పట్టుబడ్డాడని అతని వద్ద 8 కోట్ల అమెరికా డాలర్లు ఉన్నాయంటూ ఫోన్లో వివరించారు. ఇక ఛార్జ్ కింద ఆరు లక్షలు వెంటనే చెల్లించాలని బాధితురాలికి బ్యాంకు ఖాతా వివరాలు పంపారు. ఇక అనుమానం వచ్చిన మహిళ తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఇక ఇలా అపరిచిత వ్యక్తుల వలలో పడి మోసపోవద్దని పోలీసులు సూచించారు..