
నీ భార్యను రాత్రికి పంపు.. ప్రమోషన్ ఇస్తా?
ఇక ఇలాంటి సమయంలోనే ఒక ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు ఎంతో మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు కూడా సంచలనం గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో మహిళలు ప్రతి క్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవలి కాలంలో ఉద్యోగం చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు ఎంతో మంది మహిళలు. ఇలాంటి ప్రమోషన్ సమయంలోనే ఇచ్చే సమయంలో శారీరక వాంఛలు తీర్చాలని పైస్థాయిలో ఉన్న అధికారులు వేధిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
దీంతో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు వదిలేస్తున్న సంఘటనలు కూడా అది మీదికి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మీకు ప్రమోషన్ కావాలంటే నీ భార్యను ఒక రాత్రి నా దగ్గరికి పంపించు లేదంటే ప్రమోషన్ గురించి మర్చిపో అంటూ ఇక్కడ ఒక అధికారి ఒక వ్యక్తిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఎంతగానో మనస్తాపం చెందిన సదరు వ్యక్తి చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని లఖింపూర్ కేరి లో వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగి ప్రమోషన్ కావాలంటూ కోరగా ఇక ఉన్నతాధికారిని భార్యను రాత్రికి పంపించు అని ఆదేశించాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చనిపోయేముందు సెల్ఫీ వీడియో తీసుకొని ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా ఎవరూ చర్యలు తీసుకోలేదని చెప్పాడు. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది.