ఊహించని ట్విస్ట్.. దొంగలకే షాకిచ్చిన యజమాని?

praveen
ఏదైనా ఇంటికి తాళం వేసి కనిపించింది అంటే చాలు దొంగలు తమ ప్రతాపం చూపిస్తున్నారు. రహస్యంగా ఇంట్లోకి చొరబడి  ఇక ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు నగదు నగలు అందినకాడికి దోచుకోవడం చేస్తూ ఉన్నారు. ఇలా ఇటీవలి కాలంలో ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళాలి అంటే భయపడే పరిస్థితి తీసుకు వచ్చారు దోపిడి దొంగలు. ఇక ఇటీవల కాలంలో రెగ్యులర్ గా కాకుండా కాస్త వెరైటీగా సరికొత్తగా ప్లాన్ వేస్తూ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 ఏకంగా సీసీ కెమెరా నిఘా  ఉన్నప్పటికీ సీసీ కెమెరాలకు దొరక్కుండా చోరీ లకు పాల్పడుతూ ఉన్నారు.  మరి కొంత మంది మాత్రం చివరికి సీసీ కెమెరాలకు దొరికిపోతే కటకటాల పాలు అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీకి వచ్చి ఇక దోచుకోవడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కానీ ఇక్కడ ఒక యజమాని మాత్రం దొంగలకు మించిన తెలివిని ప్రదర్శించటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. గుంటూరు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పాలపర్రు గ్రామానికి చెందిన ఓ కుటుంబం వేరే ఊరికి వెళ్ళింది. అయితే అదే అదనుగా భావించిన దొంగలు రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా కాంపౌండ్ లోకి దూకారు.


 ఈ క్రమంలోనే తాళం పగులగొట్టి ఇక దోపిడీ చేయాలని అనుకున్నారు. అయితే ఆ ఇంటికీ సిసి కెమెరాలను పెట్టాడు ఇంటి యజమాని. సీసీ కెమెరాలు అతని మొబైల్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇంట్లో దొంగలు పడ్డారు అనే విషయాన్ని మొబైల్ లో చెక్ చేసిన ఇంటి యజమాని పక్కనే ఉన్న వాళ్ళకి సమాచారం అందించాడు. ఇక చుట్టుపక్కల వాళ్ళు లేచినట్లు అలికిడి విన్న దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. దొంగలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: