ఉరేసుకున్న మహిళా ఎస్సై.. అసలేం జరిగింది?

praveen
సాధారణంగా పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఎంతో ధైర్యంగా విధినిర్వహణలో ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఎంతో మంది సామాన్య ప్రజలు సైతం పోలీసులను చూసి ఎలా ధైర్యంగా ఉండాలి అని స్ఫూర్తి పొందుతూ ఉంటారు. ఇలా ధైర్యసాహసాలకు పోలీసులు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటి పోలీస్ వృత్తిలో కొనసాగుతూ ఇక్కడ ఒక మహిళ మాత్రం చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ప్రజల కష్టాలు తీర్చే ఆ పోలీసుకు పాపం ఏం కష్టం వచ్చిందో చివరికీ బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.


 కేరళలోని తిరుచ్చి సమీపంలో ఓ మహిళా ఎస్సై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోలీస్  విభాగంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తిరువేరుంబర్ సమీపంలోని నావల్ పట్టిలో పోలీస్ ట్రైనింగ్ కళాశాల ఉంది. ఇక్కడ మహిళలకు పోలీసు శిక్షణ ఇస్తున్నారు. ఇక ఈ ట్రైనింగ్ కళాశాలలో ఎస్సైగా తిరుచి డివిఎస్ టోల్గేట్ నగర్కు చెందిన ఆదిలక్ష్మి అనే 56 ఏళ్ల మహిళ పని చేస్తోంది. ఇక కళాశాల ప్రాంగణంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటుంది ఆదిలక్ష్మి. ఇక ఇటీవల ఏం జరిగిందో తెలియదు గానీ ఉదయం సమయంలో తన ఇంటి ఆవరణలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.


 ఈ క్రమంలోనే గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం తిరుచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం మహిళా ఎస్సైగా పనిచేస్తున్న పోలీస్ అధికారి ఆదిలక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే ప్రశ్న మాత్రం అందరిలో తలెత్తుతుంది. పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేదా ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.  ఆదిలక్ష్మి భర్త నటరాజన్ ఎస్సైగా పనిచేసి రిటైర్ అయ్యారు. కాగా ఆదిలక్ష్మి కి ఇద్దరు కుమారులు ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: