భార్య కాదు రాక్షసి.. ఏం చేసిందో తెలుసా?

praveen
ఒకప్పుడు కట్టుకున్న బంధానికి ఎంతో విలువ ఇచ్చే వారు. పెళ్లి చేసుకున్న తర్వాత కష్టాలు అని భరిస్తూ ఇక భర్తతోనే నిండు నూరేళ్ల జీవితాన్ని గడిపేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వని మనుషులు దారుణం గా వ్యవహరిస్తున్నారు. కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా పరాయి వ్యక్తుల మోజులో పడి పోతున్నారు. చివరికి ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న వారిని హతమార్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అనే చెప్పాలి. ప్రియుడితో  సుఖం గురించి ఆలోచించిన ఆ మహిళ కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వలేదు.

 చివరికి తన మెడలో ఉన్న తాళిని తన చేతులతోనే తెంపుకునేందుకు సిద్ధమైంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడు అనే కారణంతో ఇక భర్త తాగే మధ్యంలో విషం కలిపి దారుణంగా హత్య చేసింది. తిరుమలాయపాలెం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహిత తో పాటు ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని సుబ్లేడ్ గ్రామానికి చెందిన దావా కనకరాజు  భార్య ఇద్దరు పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు. అయితే కనకరాజు భార్యకు అదే గ్రామానికి చెందిన పంచాయతీ వాటర్ మెన్ పాపయ్య తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్ల వరకూ భర్తకు తెలియకుండా రాసలీలలు సాగాయి.

 కానీ ఇటీవలే విషయం బయటపడడంతో దంపతుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో విజయ పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడినుండి పాపయ్య తో  ఫోన్ లో మాట్లాడుతూ వస్తుంది. అయితే  ప్రియుడితో సుఖానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య నిర్ణయించుకుంది. ఇక ప్రియుడికి ఈ విషయం చెప్పగా.. అతను కూడా ఓకే చెప్పేశాడు. దీంతో సూర్యాపేట జిల్లా తుమ్మలగూడెం లోని ఓ వ్యక్తి కుక్కలను సంహరించే మందు కొనుగోలు చేసి ఒక వ్యక్తి ద్వారా మద్యం బాటిల్ లో కలిపి కనకరాజు ఇవ్వాలని సూచించింది. మందు తాగిన తర్వాత ఇంటికి వెళ్లి కాళ్ళు చేతులు లాగుతున్నాయి అని చెప్పడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టంలో విషప్రయోగం జరిగినట్లు తేలింది. ఈ క్రమంలోనే విచారణ జరపగా భార్య హత్య చేసినట్లు అసలు విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: