అతనో భూతవైద్యుడు.. బాలికను పిలిచి?

praveen
దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కూడా కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాల వెంట పరుగులు పెడుతూ సభ్యసమాజాన్ని సిగ్గుపడేలా చేస్తూ ఉన్నారు. టెక్నాలజీతో ఎన్నో విలక్షణమైన ఆవిష్కరణలు తెరమీదికి వస్తుంటే ఇంకా ఎంతోమంది మంత్రాలకు చింతకాయలు రాలుతాయ్ అని నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది బురిడీ బాబాలు ప్రజలను మోసం చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మరికొంతమంది ఇక భూతవైద్యం అంటూ చెప్పి ఇక ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. భూత వైద్యం పేరుతో ఏకంగా అభం శుభం తెలియని బాలికను దారుణంగా కొట్టడంతో పాటు ఏకంగా కాల్చి ఒంటిపై గాయాలు చేసిన ఘటన  సంచలనంగా మారిపోయింది. ఈ ఘటనలో భూత వైద్యుని పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్ లోని చాట్రా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే 14 ఏళ్ల బాలిక హోలీ పండుగ తర్వాత అనారోగ్యానికి గురైంది. అయితే తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళకుండా ఇక దెయ్యం పట్టింది అంటూ అనుమానంతో మౌలానా వాహిద్ అనే భూతవైద్యుడుకు చూపించారు.


 అయితే అతడు ఆ బాలికను గమనించి ఆమెకు దయ్యం పట్టిందని వదిలి వెళ్ళాలి అంటు తాను చెప్పినట్లు గా చేయాలి అంటూ మాయమాటలతో నమ్మించాడు. నాలుగు రోజుల పాటు ఎన్నో రకాల క్షుద్రపూజలు కూడా నిర్వహించాడు సదరు వ్యక్తి. ఈ పూజలో భాగంగానే దారుణంగా బాలికను కొట్టడం ముఖం పెదవులు చేతులపై కాల్చి వాతలు పెట్టడం కూడా చేశాడు. దీంతో బాలిక ఆరోగ్యం మరింత క్షీణించింది. మతిస్థిమితం కోల్పోయింది. ఇక బాలికను తల్లిదండ్రులను ఆస్పత్రిలో చేర్పించి భూతవైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: