
ఎలుకలు కొరికిన ఆ పేషెంట్.. మృతి చెందాడు?
ఈ క్రమంలోనే ఇక ఎంజీఎం ఆస్పత్రిలో అతన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందించడం మొదలు పెట్టారు వైద్యులు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఐసీయూలో ఏకంగా ఎలుకలు అతనిపై దాడి చేయడం సంచలనంగా మారిపోయింది. ఏకంగా మొదటిరోజు చేతి వేలుని కొరికిన ఎలుకలు ఇక ఆ తర్వాత రోజు చేతి వేళ్ళతో పాటు కాలి వేళ్ళను కూడా కొరికాయి. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఇక వైద్యులు చికిత్స చేసి కట్టు కట్టారు. ఈ క్రమంలోనే ఇలా ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ అనే పేషెంట్ చివరికి మృత్యువాత పడ్డాడు అని తెలుస్తోంది.
అయితే శ్రీనివాస్ పై రెండు రోజులపాటు ఎలుకలు దాడిచేసి కొరికిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారగా దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్కు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చివరికి అక్కడ శ్రీనివాస్ చికిత్స పొందుతూ కన్నుమూశారు అన్నది తెలుస్తుంది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాస్ చనిపోయాడు అంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలా ఎలుకలు దాడి చేసిన శ్రీనివాస్ అనే పేషెంట్ చనిపోవడం మాత్రం మరింత సంక్లిష్టంగా మారిపోయింది అని చెప్పాలి..