సెక్స్ చేసేందుకు అడ్డు చెప్పిందని.. ఏం చేసాడో తెలుసా?

praveen
అను క్షణం భయం భయం.. ఏ క్షణంలో ఎటు వైపు నుంచి మానవ మృగం వచ్చి దాడి చేస్తోందని భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి. మనుషుల మధ్య ఉండటం కంటే ఏకంగా క్రూర మృగాల మధ్య అడవిలో ఉండటమే మేలు అని అనుకునే దుస్థితి.. ప్రస్తుతం ప్రతి ఆడపిల్ల మనసులో ఇలాంటి ఆలోచనలే. ఎందుకంటే నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు అలాంటివి. రోజు రోజుకి  మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు మహిళల రక్షణను అంతకంతకూ ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కఠిన చట్టాలు తీసుకొచ్చినా కోర్టులో కఠిన శిక్షలు విధించినా పోలీసులు ఎన్కౌంటర్ చేసిన తీరు మాత్రం మార్పు రావడం లేదు.


 ఇంటి నుంచి కాలు బయట పెడితే చాలు రోడ్డుపై ఆకతాయిల నుంచి బడికి వెళ్తే ఉపాధ్యాయుల నుంచి ఇక ఉద్యోగం చేయడానికి వెళితే సహోద్యోగుల నుంచి ఇక ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్ల మాత్రం అనుక్షణం భయం భయంగానే బ్రతకాల్సిన దుస్థితి ఏర్పడుతుంది నేటి రోజుల్లో. ఇక అన్నింటినీ దాటుకుని ఇంట్లోకి వస్తే ఇక ఇటీవల కాలంలో ఏకంగా సొంత వాళ్ళు కూడా అత్యాచారాలు చేసిన ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇటీవలే వికారాబాద్ జిల్లాలో 15 ఏళ్ల బాలిక హత్య సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు బయట పడ్డాయి.


ఇటీవలి ఎస్పీ కోటిరెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇక బాలిక హత్యకు పాల్పడింది ఎవరో కాదు ప్రియుడు మహేందర్ అన్న విషయం విచారణలో తేలింది అంటూ చెప్పుకొచ్చారు. పదిహేనేళ్ల బాలిక ప్రియుడు మహేందర్ ఇక తెల్లవారుజామున బయటకు వెళ్లారని.. అయితే కామవాంఛ తీర్చుకునేందుకు బాలిక అంగీకరించకపోవడంతో మహేందర్ విచక్షణ కోల్పోయాడని ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది అంటూ పోలీసులు తెలిపారు. అయితే ఇక కోపంలో మహేందర్ సదరు బాలికను గట్టిగా నెట్టడంతో చివరికి చెట్టుకు తగిలిందని.. ఇక ఆ తర్వాత బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోగానే మహేందర్  అత్యాచారం చేశాడని.. ఇలా జరిగిన కొద్దిసేపటికే బాలిక చనిపోయింది అన్న విషయం విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: