తిరుపతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మందికి పైగా మృతి..
వివరాల్లొకి వెళితే.. చిత్తూరు: తిరుపతి సమీపంలోని చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గత రోజు రాత్రి అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి పెళ్లి బృందంతో తిరుపతికి బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అలా బయలు దేరిన కొద్ది గంటల వ్యవధిలోనే బస్సు ప్రమాదానికి గురైంది. తిరుపతి సమీపంలోకి రాగానే మలుపు వద్ద లోయలో పడింది.100 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. బస్సు లోయలో పడిన ఘటనలో బస్సు డ్రైవర్, ఒక చిన్నారి సహా 13 మంది చనిపొయారు..
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు వున్నట్లు తెలుస్తుంది.క్షతగాత్రులు పెడుతున్న ఆర్తనాదాలతో ఘటనా స్థలం విషాదకరంగా మారింది.. చీకటిగా ఉన్న నేపథ్యంలో ఎంత మంది ప్రాణాలును కొల్పొయారు అనే విషయం తెలియదు.ఈ ఘటన పై సమాచారం పోలీసులు, స్టేట్ డిజాస్టర్ ఫోర్స్, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. 25మంది పరిస్థితి విషమంగా ఉందని రుయా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చీకటి కారణంగా ఎవరూ ఏంటనె సంగతి తెలియలెదని అధికారులు అంటున్నారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.. ఈ ఘోర ప్రమాదం వల్ల ఘటనా స్థలంలో రక్తం తో ఎరుపు రంగు పులుముకుంది.