భూకబ్జా కేసు.. కోర్టులో హాజరైన పరమశివుడు?
చత్తీస్ఘడ్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాయగడ్ లోని 25 వ వార్డు కు చెందిన సుధా రాజ్వాడే బిలాస్పూర్ హైకోర్టులో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారు అంటూ ఆరోపిస్తూ ఒక పిటిషన్ వేశారు. ఇక ఈ భూమిలో ఉన్న శివాలయం సహా 16 మందిని నిందితులుగా పేర్కొంటూ పిటిషన్ వేయడం గమనార్హం. అయితే ఇక సదరు వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు సంబంధిత అధికారులు ఇక ఈ విషయంపై దర్యాప్తు జరపాలి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన స్థానిక తాసిల్దార్ కార్యాలయం ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ఇక ఈ కేసులో పదిమందికి నోటీసులు ఇచ్చారు అధికారులు.
ఈ క్రమంలోనే ఈనెల 25వ తేదీన కోర్టులో జరగబోతున్న విచారణకు హాజరై ఇక భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇక అధికారుల ఆదేశాల ప్రకారం కోర్టుకు హాజరు కాకపోతే చర్యలు తప్పవని భూమిని కాళీ చేయించడమే కాదు 10 వేలు జరిమానా విధించాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే నోటీసులు అందుకున్న పరమశివుడి తో పాటు 9మంది కోర్టు విచారణకు హాజరయ్యారు. గుడిలో వున్న శివ లింగాన్ని ఏకంగా కోర్టు మెట్లు ఎక్కించి విచారణలో తీసుకువచ్చారు అక్కడి జనాలు. ఇది కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.