హృదయ విదారకం.. బిడ్డ శవాన్ని భుజాలపై మోసిన తండ్రి?

praveen
పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని చెబుతుంటారు అధికారులు. ఇక తాము ప్రజల పక్షాన నిలబడే నాయకులము అంటూ ఉంటారు రాజకీయ నాయకులు. కానీ వాస్తవంగా చూసుకుంటే ప్రజలు మాత్రం ఇంకా అవస్థలు పడుతూనే ఉన్నారు అనేది తెలుస్తుంది. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేక ఎంతో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చాలామంది. ఇక్కడ ఇలాంటి ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.


 శవాలను తరలించేందుకు వాహనం అందుబాటులో లేకపోవడంతో చివరికి కన్నతండ్రి పది కిలోమీటర్ల మేర మోసుకు వెళ్ళాడు.. ఇది కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ఆమ్ దళ గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ కు సురేఖ అనే 7 ఏళ్ల కూతురు ఉంది. సురేఖ నాలుగైదు రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతుంది. దీంతో బాలికను ఖానాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకువెళ్లాడు తండ్రి. ఇక వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆక్సిజన్ లెవెల్స్ తీవ్రంగా పడిపోయాయని తెలిపారు. ఇక అంతలోనే  ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చివరికి మృతి చెందింది ఆ చిన్నారి.


 ఇక అదే సమయం లో ఆసుపత్రిలో శవాలను తరలించిన వాహనం లేక పోవడంతో ఇక చేసేదేమి లేక బరువెక్కిన గుండెతో ఆ తండ్రి తన కూతురి శవాన్ని భుజాలపై వేసుకుని పది కిలోమీటర్ల నడక సాగించి స్వగ్రామానికి చేరుకున్నారు. ఇక దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బిడ్డను తండ్రి భుజాలపై మోసుకెళ్తున్న వీడియోని చూసి చలించిపోయాను అంటూ మంత్రి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఆరోగ్య శాఖ మంత్రి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: