బైక్ కొనివ్వలేదని.. కొడుకు దారుణం?
ఇక చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీస్తూ దారుణం గా వ్యవహరిస్తున్నారు. ఒక మనిషి ప్రాణాలు తీస్తే జైలు శిక్ష పడుతుంది అన్న భయం ఎవరిలో కనిపించడం లేదు అని చెప్పాలి. పరాయి వాళ్ళ విషయంలోనే కాదు ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళ విషయంలో కూడాజాలి దయ చూపించడం లేదు మనుషులు. ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే.. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.
ఏకంగా నవమాసాలు మోసి తన ఊపిరినె ఊపిరిగా అల్లి కొడుకుకు జన్మనిచ్చింది ఆ తల్లి. కొడుకు పుట్టగానే రారాజు పుట్టాడు అంటూ ఎంతగానో మురిసిపోయింది. ఇక తన కష్టాలు మొత్తం తీరిపోతాయి అని అనుకుంది. కాని కొడుకును కాదు ఏకంగా తన ప్రాణాలను తీసే కాలయముడునీ కన్నాను అన్న విషయం మాత్రం గుర్తించలేకపోయింది. బైక్ కొనేందుకు డబ్బులు ఇవ్వలేదు అన్న కారణంతో ఏకంగా కన్నతల్లిని దారుణంగా హత్యచేశాడు కొడుకు. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పోచమ్మ అనే వృద్ధురాలిని చిన్న కుమారుడు మిరుదొడ్డి కుమార్ హత్యచేశాడు. బైక్ కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాలని తల్లిని అడిగాడు. కానీ ఆమె నిరాకరించింది. దీంతో ఆమె నిద్రిస్తున్న సమయంలో చివరికి హత్య చేసినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.