కొలిక్కి వచ్చిన బాలుడి హత్య కేసు.. చంపింది ఎవరో కాదు?
తొలుత బాలుడు చెట్టుకు ఉరి వేసుకున్నట్లు గా కనిపించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు అని అందరూ భావించారు. ఈ క్రమంలోనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా అసలు విషయాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లా కలిగిరి మండలం లోని అత్తవారి పల్లికి చెందిన రవి తులసి దంపతులకు కుమారుడు ఉదయ్‌కిరణ్ ఉన్నాడు. అయితే ఈనెల 11వ తేదీన కనిపించకుండా పోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ తర్వాత రోజే ఆద్దవారి పల్లి సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు బాలుడు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు సవాలుగా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు ఈ కేసులో ఎన్నో అనుమానాలు ఉండటంతో పక్క సాక్ష్యాధారాలను సేకరించడంలో ఎంతగానో కష్టపడి పోయారు పోలీసులు. ఎట్టకేలకు నిందితులను గుర్తించారు.
ఈ క్రమంలోనే హత్య చేసింది ఎవరో కాదు బాబాయ్ అన్న విషయం ఇక పోలీసు విచారణలో తేలింది. బాలుడు చనిపోవడానికి ముందు రోజు సాయంత్రం ఇక బాబాయ్ సహదేవ్ సహా బంధువు రాజేశ్వరి తో కనిపించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఇక ఈ కేసును ఛేదించడం పోలీసులకు సులభంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక తమ అక్రమ సంబంధాలు ఎక్కడ బయట పెడతాయో అన్న భయంతో బాబాయ్ సమీప బంధువు రాజేశ్వరి బాలుడు మర్మాంగాలపై కొట్టి ఇక మెడకి టవల్ చుట్టి చెట్టుకు ఉరి వేసినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అనే చెప్పాలి..