విడాకులు తీసుకున్నారు.. కానీ మళ్లీ ఇదేం పని?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మనస్పర్థల కారణంగా భార్యతో విడాకులు తీసుకున్నాడు సదరు వ్యక్తి. కానీ భార్యపై పగ మాత్రం అలాగే ఉండిపోయింది. దీంతో మాట్లాడాలని పిలిచి దారుణంగా భార్య కాళ్ళు నరకమే కాదు హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తుముకూరు నగరంలో వెలుగులోకి వచ్చింది.. బాబు తుముకూరు మధుగిరి కి చెందిన అనితలకు కొన్నేళ్ళ క్రితం వివాహం జరిగింది. అయితే ఇటీవలే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు భార్యాభర్తలు. ఈ క్రమంలోనే ప్రస్తుతం విడిగానే ఉంటున్నారు.
అయితే భార్య పై కోపంతో రగిలిపోయిన భర్త బాబు ఎలాగైనా హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ క్రమంలోనే మాట్లాడాలి అంటూ భార్య అతని పిలిపించాడు. ఇద్దరు హోటల్లో అల్పాహారం తీసుకున్న అనంతరం అక్కడి నుంచి ఈ ప్రాంతానికి తీసుకెళ్లగా అక్కడ మరోసారి భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడ్డారు. అయితే పథకం ప్రకారమే తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా భార్య కాళ్ళు నరికేసాడు బాబు. ఇక అక్కడ్నుంచి హోటల్కు వెళ్లి విషయాన్ని అక్కడి సిబ్బంది చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అయితే భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తట్టుకోలేక ఇలా చేశా అంటూ పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు భర్త బాబు.