రెచ్చిపోయిన యువకుడు.. మహిళలను బంధించి?
ఇలా నేటి రోజుల్లో ఇంకా మహిళలు అనుక్షణం భయపడే పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ జిల్లాలో ఓ మహిళను మానసికంగా శారీరకంగా దారుణంగా హింసించాడు యువకుడు. ఇక ఆ మహిళ జీవితాన్ని మొత్తం నరకప్రాయం చేసేసాడు. ఏకంగా మహిళకు మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేశాడు. ఇక నిందితుడు తన మొబైల్ కెమెరాలో అశ్లీల వీడియోలు ఫొటోలను కూడా బంధించాడు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే వాటిని సోషల్ మీడియా లో పెడతాను అంటూ బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడంటూ మహిళ ఆరోపిస్తూ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది.
ఇక వేదింపులు భరించలేక పోతున్నాను అంటూ మహిళా ఎదురు తిరగడంతో చివరికి నిందితుడు అశ్లీల వీడియోలు ఫోటోలు ఇంటర్నెట్లో పెట్టినట్లు తెలుస్తోంది. సదరు వివాహిత భర్తకి కూడా ఆ ఫోటోలు వీడియోలు పంపాడు. ఈ క్రమంలోనే సదరు బాధిత మహిళ భర్తతో కలిసి ఒక రాజకీయ నాయకుడు ని తీసుకుని తిరిగి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇదే విషయంలో పోలీసులు మాత్రం కాలయాపన చేస్తూనే సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారని బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులను ఆశ్రయించగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు..