రోడ్డు ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా?

frame రోడ్డు ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా?

praveen
ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వార్తలే ఎక్కువగా తారసపడుతున్నాయ్. ఎందుకంటే ఇటీవలే రోడ్డు నిబంధనలు పాటించకుండా అతి వేగం కారణంగా ఎంతోమంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ఉండడం గమనార్హం. ఇక ఇలాంటి రోడ్డు ప్రమాదాల ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉంటే ఇంకా.ఎంతోమందిని జీవచ్ఛవాలుగా మార్చుతూ జీవితాలు దుర్భరంగా మార్చేస్తూ ఉన్నాయ్. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని.. ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకోవాలి అంటూ పోలీసులు ఎన్ని సార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాహనదారులలో మాత్రం మార్పు రావడంలేదు.



 వెరసి రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.  ఇటీవలి కాలంలో అయితే కొంతమంది వాహనదారులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఇక నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. ఇలా కొంతమంది వాహనదారులు చేసిన తప్పు కారణంగా అమాయకపు ప్రజలు కూడా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇకపోతే ఇటీవల మీర్పేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏకంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బీజేపీ క్వార్టర్స్ నుంచి జిల్లెలగూడ వెళ్ళే దారిలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.



 అయితే ఉదయం సమయంలో ఆయిల్ టాంకర్ నడుపుతున్న డ్రైవర్ నిద్రావస్థలో ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఏకంగా వేగంగా ఉన్న వాహనం అదుపు తప్పడంతో పోలీస్ బూతును ఢీకొని బోల్తా పడింది. అయితే దానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక క్రేన్ సహాయంతో వెంటనే ఆ లారీ ని పక్కకు తొలగించారు. అయితే ఈ ప్రమాదం నేపథ్యంలో కాసేపటి వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: