ఉద్యోగి ఘనకార్యం.. రిచ్ గా పెళ్లి చేసుకోవడానికి?
ఇక్కడ ఒక వ్యక్తి ఘనంగా పెళ్ళిచేసుకోవాలని అనుకున్నాడు. ఇక రిచ్గా పెళ్లి చేసుకోవాలనుకున్న సదరు వ్యక్తి మనసులో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. చివరికి తాను పని చేసే బ్యాంకునే దోచేశాడు.. ఈ ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. డి సి సి బ్యాంకు లో ఇటీవలే మార్చ్ ఆరవ తేదీన 6 కోట్ల విలువ చేసే బంగారం, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అదే బ్యాంకులో క్లర్కుగా పని చేస్తున్నా బసవరాజు సిద్ధంగను విచారించారు.
తమదైన శైలిలో విచారణ జరపగా.. క్లర్క్ గా పనిచేసే వ్యక్తి అతని స్నేహితులు సంతోష్, గిరీష్ లతో కలిసి దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. ఇక వీరిని కూడా అరెస్టు చేసిన పోలీసులు నాలుగు కోట్ల 20 లక్షల నగదు కోటి అరవై మూడు లక్షలు విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళాలను ఉపయోగించి క్లర్క్ గా పనిచేసే వ్యక్తి దొంగతనం లో కీలక పాత్ర వహించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతను పెళ్లిని వైభవంగా చేసుకోవడానికి డబ్బు లేకపోవడంతో ఈ చోరీకి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.