కొడుకు అడగ్గానే అలా చేసిన పేరెంట్స్.. చివరికి ప్రాణం పోయింది?

praveen
సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి లోటూ రాకుండా చూసుకుంటారు. ఏదైనా కావాలి అని అడిగారు అంటే చాలు ఏకంగా దానికి కొన్నివ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. దీంతో ఇటీవల కాలంలో ఎంతోమంది విద్యార్థులు తల్లిదండ్రులను కాలేజీ కి వెళ్లడానికి బైక్ కావాలి అంటూ యువకులు అడుగుతూ ఉండటం గమనార్హం. అదికూడా ఒక సాదా సీదాబైక్ కాదు ఏకంగా రై రై మంటూ దూసుకుపోయే స్పోర్ట్స్ బైక్ కావాలి అంటూ పట్టుబడుతున్నారు. ఎంతో గారాబంగా పెంచినా కొడుకు బైక్ అడిగిన తర్వాత తల్లిదండ్రులు కొనివ్వకుండా ఉంటారా.


 తమ కొడుకు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు అని లక్షల రూపాయలు ఖర్చుపెట్టి స్పోర్ట్స్ బైక్ కొనివ్వడం లాంటివి చేస్తూ ఉన్నారు. కానీ ఇలా తల్లిదండ్రులు స్పోర్ట్స్ బైక్ కొనివ్వటమే ఇక వారికి కడుపుకోత మిగులుస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే విద్యార్థి దశలో ఉన్న వారు ఇక స్పోర్ట్స్ బైక్ చేతిలో ఉన్న తర్వాత ఊరుకుంటారా.. రహదారులపై ఓవర్ స్పీడ్ తో దూసుకుపోతుంటారు. చివరికి రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కొడుకు అడగగానే స్పోర్ట్స్ బైక్ కొనిస్తే ఎంతో సంతోషం పడిపోతాడు అని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు.



 కానీ ఇక ఆ బైక్ ఏకంగా తమకు కడుపుకోత మిగులుస్తుందని అని మాత్రం ఊహించలేకపోయారు. మితిమీరిన వేగంతో వెళ్తూ బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఆల్విన్ కాలనీ కి చెందిన ఫేస్ వన్ లో నివాసముంటున్న శివశంకర్ రెడ్డి కుమారుడు సాయి స్వరూప్ రెడ్డి మితిమీరిన వేగంతో కెటిఎమ్ బైక్ పై నుంచి అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం లో సాయి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: